Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీ పై వేటు బీజేపీకి లాభమా …?నష్టమా …??

రాహుల్ గాంధీ పై వేటు బీజేపీకి లాభమా …?నష్టమా …??
-భగ్గుమంటున్న కాంగ్రెస్ శ్రేణులు …కాంగ్రెస్ ఉన్నతస్థాయి కమిటీ భేటీ
-దేశవ్యాపిత ఆందోళనలకు పిలుపు …
-కేంద్రం చర్యలపై సర్వత్రా నిరసనలు
-ప్రస్వామ్యానికి చీకటి రోజుని వ్యాఖ్యానాలు
-రాహుల్ పై చర్యలను ఖండినచిన మమతా , స్టాలిన్ , కేసీఆర్
-రాహుల్ పై చర్యలను సమర్ధించుకునేందుకు నానాతంటాలు పడుతున్న బీజేపీ …

రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై వేటు వేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. సూరత్ కోర్ట్ ఇచ్చిన తీర్పును పలువురు తప్పు పడుతున్నారు . అయితే రాహుల్ పై చర్యలు బీజేపీకి లాభమా …? నష్టమా అనే చర్చ దేశవ్యాపితంగా జరుగుతుంది. ఇది కచ్చితంగా నష్టమేనని అభిప్రాయాలు వెలువడుతున్నాయి. బీజేపీ శ్రేణులు రాహుల్ పై చర్యలను సమర్ధించుకునేందుకు నానా తంటాలు పడుతుంది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాల కోసం రోడ్ వెక్కాయి. కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశం అయి దేశవ్యాపిత ఆందోళనలకు పిలుపు నిచ్చారు . ఒక పక్క న్యాయపోరాటం మరో పక్క ప్రజల మద్దతు కోరతామని కాంగ్రెస్ ప్రకటించింది.

మోడీలు అంటేనే దొంగలు అనే అర్థం వచ్చేలా 2018 లో రాహుల్ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రసంగించారని ఆయనపై చర్యలు తీసుకోవాలని సూరత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సూరత్ జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు .దీనిపై గత నాలుగు సంవత్సరాలుగా వాదనలు జరుగుతున్నాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా మేజిస్ట్రేట్ చివరకు తీర్పు నిచ్చారు . ఎంపీ రాహుల్ గాంధీకి రెండు సంత్సరాలు జైలు జీవితం గడపాలని ఆ తీర్పులో పేర్కొన్నారు .

చట్ట ప్రకారం రెండు సంవత్సరాలు అంతకు పైబడిన ఎంపీ లేదా ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలకు చట్ట సభలో అర్హుడిగా కొనసాగే వీలులేదు … దాని ప్రకారం ఆయన ఎంపీగా కొనసాగటానికి వీలు లేదు …రాహుల్ అనర్హత వేటుకు తమకు ఏమాత్రం సంబందం లేదని చేస్తున్న వాదనలు ,చెబుతున్న మాటలు ప్రజలు నమ్మేవిగా లేవనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి . …నిజంగా బీజేపీకి సంబంధం లేకపోయినా ప్రజలు వారి వాదనలను
నమ్మడంలేదు .

సహజంగా ఎన్నికల ప్రచారంలో రకరకాల ఆరోపణలు ప్రత్యారోపణలు చేయడం రాజకీయనాయకులకు సహజం …ఒక వేళ కేసులు వేయడం ప్రారంభం అయితే ఏ పార్టీ నాయకులూ విమర్శలకు మినహాయింపు కాదు . అప్పుడు ఈ విధంగా కేసులు వేసి తీర్పులు వస్తే చాలామంది పదవులు ఉడటం ఖాయం . రాహుల్ గాంధీ ఎన్నికల సభల్లో ,నిరవ్ మోడీ , లలిత్ మోడీ లను ఉద్దేశిస్తూ అవినీతి పై మాట్లాడుతూ మోడీలంటేనే దొంగలుగా ఉన్నారనే అర్థం వచ్చేట్లుగా మాట్లాడారని కాంగ్రెస్ చెపుతుంది . అలాంటప్పుడు బీజేపీ ,నిరవ్ మోడీ , లలిత్ మోడీలు అవినీతికి పాల్పడలేదని , దొంగలు కాదని చెప్పదల్చుకున్నారా ? అనే సందేహాలు సహజంగానే ప్రజల్లో కలుగుతాయి. దానికి బీజేపీ సమాధానం చెప్పాలి …ఎందుకంటే కేసు వేసింది బీజేపీ ఎమ్మెల్యే అయినందున ,తమకు ఏమాత్రం సంబంధం లేదని , చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అందరు చెప్పిన డైలాగునే వారు చెప్పడం జరుగుతుంది …కానీ దీన్ని పౌరసమాజం నమ్మాలి …

రాహుల్ సభ్యత్వం తాత్కాలికంగా పోవచ్చు …దీనివల్ల బీజేపీకి వచ్చే లాభం కన్నా నష్టం ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ముక్తఖంఠం తో రాహుల్ ఎంపీ పదవిపై వేటు వేయడాన్ని తప్పు పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఖండిస్తున్నాయి. నిన్నమొన్నటివరకు రాహుల్ నాయకత్వాన్ని విభేదించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం ఈ చర్యపై స్పందించారు . అదే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ , తమిళనాడు సీఎం స్టాలిన్ తోపాటు అనేక మంది జాతీయ నాయకులూ ఈ చర్యలను తప్పుపట్టారు . రాహుల్ సభ్యత్వ రద్దు కచ్చితంగా కాంగ్రెస్ కు, రాహుల్ గాంధీకి వరంలాంటిదేనని రాజకీయ పండితులు సైతం అభిప్రాయపడుతున్నారు …. భారత్ జోడో యాత్ర , ఇటీవల బ్రిటన్ పర్యటనలతో రాహుల్ కు పెరిగిన ఇమేజిని డ్యామేజ్ చేయాలనీ చూస్తున్న బీజేపీ తాను డ్యామేజ్ కావడం ఖాయమని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి….

Related posts

ఆఫ్ఘన్​ ప్రభుత్వ పగ్గాలు బరాదర్​ కే!

Drukpadam

యూపీ లో నేరాలు ఘోరాలపై అమిత్ షా ప్రతిపాదనకు అఖిలేష్ సై!

Drukpadam

ప్రతిష్టాత్మకంగా మంచిర్యాల కాంగ్రెస్ సభ …భట్టి పాదయాత్రకు హైలెట్ …

Drukpadam

Leave a Comment