Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పాలేరులో సిపిఎం ,కొత్తగూడెంలో సిపిఐ పొటిఖాయమేనా…!

పాలేరులో సిపిఎం ,కొత్తగూడెంలో సిపిఐ పొటిఖాయమేనా…?
మధిర ,వైరా , భద్రాచలంలపై సమాలోచనలు
కమ్యూనిస్టులను కలుపుకొని పోయేందుకు కేసీఆర్ నిర్ణయం
సిట్టింగులలో కలవరం
కమ్యూనిస్టులతో పొత్తు కావాలంటూనే ..తమ సీట్లు వదులుకునేందుకుససేమీరా అంటున్న సిట్టింగ్ లు
కూసుమంచి సిపిఎం సభలో పాల్గొన్న కందాల
కమ్యూనిస్టులతో కలిసి ఉమ్మడి జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన కందాల
నేడు బీఆర్ యస్ ఆత్మీయసమ్మేళనంలో కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయన్న వైనం
కందాల వ్యాఖ్యలపై కమ్యూనిస్టుల మండిపాటు

ఎవరు అవునన్నాఎవరు కాదన్నా బీఆర్ యస్ కమ్యూనిస్టులు కలిసి ప్రయాణం చేయాల్సిన అనివార్యమైనా పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశంలో , రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ సమీకరణలకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగా ఉమ్మడి ఖమ్మం ,నల్లగొండ , వరంగల్ , రంగారెడ్డి కరీంనగర్ , లాంటి జిల్లాల్లో కమ్యూనిస్టులతో కలిసి పోటీచేయడంవల్ల తమకు లాభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల దగ్గర నుంచి కమ్యూనిస్టులతో కల్సి ప్రయాణం చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న కేసీఆర్ వారికీ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించుకున్నట్లు సమాచారంఇది కొంతమంది బీఆర్ యస్ తాజాలకు ఇష్టం ఉన్నా లేకున్నా కమ్యూనిస్టులతో ప్రయాణం దేశ ప్రయోజనాలకు ఎంతో అవసరమని కేసీఆర్ భావిస్తున్నారు .

ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు పాలేరు , కొత్తగూడెం , వైరా , మధిర , భద్రాచలం అసెంబ్లీ సీట్లను అడుగుతున్నాయి. పాలేరు , కొత్తగూడెం సీట్లు రెండు పార్టీలకు కీలకంగా మారాయి. దీంతో గులాబీ బాస్ రెండు సీట్లలో కమ్యూనిస్టుల పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుంది.

జనచైతన్య యాత్రల్లో భాగంగా పాలేరు పర్యటనలో బీఆర్ యస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కూసుమంచి సిపిఎం సభలో పాల్గొన్నారు. సిపిఎం పోరాట పటిమను కీర్తించారు .

ఈసభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ బీజేపీ ఓడించేందుకు తాము బీఆర్ యస్ తో కలిసి ప్రయాణం చేయాలనీ నిర్ణయించుకున్నామని జిల్లాలో బీఆర్ యస్ కమ్యూనిస్టులు కలిసిన తర్వాత మరొకరికి గెలిచే అవకాశం ఉండదని అన్నారు. తాము పాలేరు సీటు అడుగుతున్నామని అయితే కేసీఆర్ కందాల కు ఇచ్చినా గెలిపించే భాద్యత తమ పార్టీ నుంచి తీసుకుంటామని అన్నారు . అదే సందర్భంలో సిపిఎం కు ఇచ్చిన కందాల అదే రీతిలో పనిచేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు . కందాల మాట్లాడుతూ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే ఉమ్మడి జిల్లాలో 10 కి 10 రావడం ఖాయమని అన్నారు . సిపిఎంకు ఇస్తే గెలిపిస్తామని మాత్రం అనలేదు .పైగా తమ్మినేని తమకే సీటు అనే అర్థంలో చెప్పిన విషయం ఆయనకు ఆలశ్యంగా అర్ధం అయినట్లు ఉంది. శనివారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచిలో   ఆత్మీయ సమ్మేళనం జరిగింది.అందులో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని అనడంపై కమ్యూనిస్టులు భగ్గుభగ్గుమంటున్నారు . అసలు ఆయన గెలవడానికి కారణం కమ్యూనిస్టులే అనేది వాస్తవంగత ఎన్నికల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన ఉపేందర్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపిస్తేకమ్యూనిస్టుల ఓట్లతో గెలిచిన ఉపేందర్ రెడ్డి పార్టీ మారి కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని మాట్లాడటంపై సిపిఐ ,సిపిఎం నేతలు మండిపడుతున్నారు . ఇదా కందాల నీ సంస్కారం అంటున్నారుకందాల తీరు మార్చుకోకపోతే తడఖా చుపిస్తామంటూ హెచ్చరిస్తున్నారు . విషయం కేసీఆర్ దాకా వెళ్లినట్లు సమాచారం

కందాళ తీరు మార్చుకోసిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్
కమ్యూనిస్టులను విమర్శిస్తే మూల్యం చెల్లించక తప్పదు

పాలేరు శాసన సభ్యులు కందాళ ఉపేందర్రెడ్డి తన తీరు మార్చుకోవాలని తన పదవి కాంక్ష కోసం పార్టీని సైతం తప్పుదారి పట్టిస్తున్నారని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ ఆరోపించారు. పూటకొక మాట మాట్లాడే ఉపేందర్రెడ్డికి కమ్యూనిస్టులను విమర్శించే అర్హత లేదన్నారు. కమ్యూనిస్టు పార్టీ ఓట్లతో గెలిచి కమ్యూనిస్టులకు ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయని వ్యాఖ్యనించడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన సామెతను గుర్తుకు తీసుకు వస్తుందన్నారు. కమ్యూనిస్టుల పట్ల ఆయన వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదని గతంలో పలుమార్లు ఇదే వైఖరిని అవలంభించారని ప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో బిజెపి ముప్పును గ్రహించి విశాల ప్రతిపాదికన లౌకిక శక్తులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలు ప్రయాణం చేయాలని భావిస్తున్నాయని ఇటువంటి. తరుణంలో మతోన్మాద వ్యతిరేక శక్తులకు వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కందాళ వ్యాఖ్యలు విఘాతం కలిగిస్తున్నాయన్నారు. మునుగోడు ఫలితం తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచనలకు భిన్నంగా కందాళ వ్యాఖ్యనిస్తున్నారని ప్రసాద్ తెలిపారు. స్వార్ధం కోసం, పదవుల కోసం పార్టీలు మార్చిన కందాళ కమ్యూనిస్టులను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో కమ్యూనిస్టుల అవసరాన్ని అన్ని వర్గాల ప్రజలు గుర్తిస్తున్నారని కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం మూలంగానే దేశంలో మతోన్మాద శక్తులు పెచ్చరిల్లుతున్నాయని, ఆర్థిక దోపిడీ. జరుగుతుందన్న భావన ప్రస్తుతం నెలకొందన్నారు. కమ్యూనిస్టుల పోరాటాల గురించి, కమ్యూనిస్టుల శక్తి గురించి కాంట్రాక్టర్ కందాళ ఏమి తెలుసునని ప్రసాద్ ప్రశ్నించారు. ఇక ముందు కమ్యూనిస్టులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని ప్రసాద్ హెచ్చరించారు. ఇప్పటికైనా కమ్యూనిస్టులకు ఓట్లు వేయరన్న మాటలను ఉపసంహరించుకోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.

కందాల వ్యాఖ్యలు పై సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నాఅభ్యంతరం
తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వద్దని హితవు

కందాల వ్యాఖ్యలు పై సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నాఅభ్యంతరం
తొందరపాటు స్టేట్మెంట్లు ఇవ్వద్దని హితవు పలికారు. దేశంలో ,రాష్ట్రంలో పొంచి ఉన్న బీజేపీ ప్రమాదాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు అధికారంలో ఉన్న బీఆర్ యస్ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీచేయాలని సిపిఎం ,సిపిఐ పార్టీలు నిర్ణయించయని సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపారు . ఓట్లు సీట్లు , పొత్తులు ఎత్తులపై ఇంకా చర్చలు జరగలేదని స్పష్టం చేశారు . అయితే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి శనివారం చర్చ ఫాస్టర్లతో జరిగిన సమావేశంలో కమ్యూనిస్టులకు ఓట్లు వేసే రోజులు పోయాయని అనడం లెఫ్ట్ , బీఆర్ యస్ కలిసి నడవాలనే కేసీఆర్ ఆలోచనలకు , విరుద్ధంగా ఉండటాన్ని నున్నా ఆక్షేపించారు

పొత్తుల గురించి నిత్యం మీడియాలో వస్తున్నా వార్తలకు సమాధానంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పనిచేస్తామని చెప్పారని ,ఎన్నికలు వచ్చినప్పుడు సీట్లు ఎవరికీ అనేది నిర్ణయించుకోవచ్చునని ,తమకు బలం ఉన్న చోట్ల సీట్లు అడుగుతామని , పాలేరు కూడా అడిగే అవకాశాన్ని తోచిపుచ్చలేమని తమ్మినేని సభలో చెప్పారని నున్నా అన్నారు . సీటు ఎవరికీ వచ్చినా కలిసి గెలిపించుకుందామని ఒకవేళ బీఆర్ యస్ కు వస్తే తానే గ్రామగ్రామాన తిరిగి ప్రచారం చేసి గెలిపిస్తానని తమ్మినేని అన్నారని నున్నా గుర్తు చేశారు . దీనిపై కందాల మాటలు రెండు పార్టీల ఐక్యతకు కేసీఆర్ ఆలోచనలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని కందాల గుర్తంచుకోవాలన్నారు.

 

Related posts

మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మార్పుకు రేవంత్ రెడ్డి, భట్టినే బాధ్యత వహించాలి:జగ్గారెడ్డి!

Drukpadam

ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం…

Drukpadam

శివసేనలో ముసలం.. అత్యవసర సమావేశానికి ఉద్ధవ్ థాకరే పిలుపు!

Drukpadam

Leave a Comment