Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష!

చిట్ ఫండ్స్ పేరుతో మోసం.. 250 ఏళ్ల జైలు శిక్ష!

  • సీహోర్ జిల్లా కోర్టు తీర్పు
  • దేశంలో అత్యధిక జైలు శిక్ష తీర్పు ఇదే
  • 18 శాతం రాబడి ఆశ చూపి భారీగా వసూళ్లు
  • చివరికి ఏమీ ఇవ్వకుండా చేతులెత్తేసిన సంస్థ

చిట్ ఫండ్స్ పేరుతో సామాన్యులను నిండా ముంచిన ఓ సంస్థ డైరెక్టర్ కు కోర్టు కఠిన శిక్ష విధించింది. దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల పరిధిలో 35 లక్షల మంది ఇన్వెస్టర్లను రూ.4,000 కోట్ల మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో మధ్యప్రదేశ్ లోని సీహోర్ జిల్లా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

సాయి ప్రసాద్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ బాలాసాహెబ్ భాప్కర్ ను నిందితుడిగా ప్రకటించిన కోర్టు.. 250 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దేశంలో ఒక నేరస్థుడికి అత్యధిక జైలు శిక్ష ప్రకటించడం ఇదే మొదటిసారి. ఈ కేసులో భాప్కర్ తోపాటు ఇతరులను నిందితులుగా న్యాయస్థానం ప్రకటించింది.

ఐదేళ్లలో డబ్బు రెట్టింపు ఇస్తామన్న హామీతో చాలా మంది ప్రజలు ఈ సంస్థలో ఇన్వెస్ట్ చేశారు. ఏటా 18 శాతం రాబడి ఆశ చూపించాడు. కానీ, ప్రాజెక్టుల నిర్మాణాన్ని మందుకు తీసుకెళ్లలేదు. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి చెల్లించలేదు. దీంతో కొందరు పోలీసులను ఆశ్రయించారు.

Related posts

కృష్ణా జిల్లా కలెక్టరేట్ లో తుపాకీ మిస్ ఫైర్!

Drukpadam

పచ్చని సంసారంలో యూట్యూబ్ జ్యోతిషం చిచ్చు.. గృహిణి ఆత్మహత్య

Ram Narayana

మాయలేడి వగలమారి మాటలు వాట్సాప్ వీడియో తో నగ్నంగా మార్చి బ్లాక్ మెయిలింగ్!

Drukpadam

Leave a Comment