Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదు: మిథున్ రెడ్డి

  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు
  • ఈ నలుగురిని సస్పెండ్ చేసిన పార్టీ హైకమాండ్
  • పూర్తి ఆధారాలతోనే సస్పెండ్ చేశామన్న మిథున్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నాయకత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందిస్తూ… పూర్తి ఆధారాలతోనే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జగన్ తో విభేదించిన వారికి ఓటమి తప్పదని అన్నారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలకు ఏ గతి పట్టిందో ఇప్పుడు వీరికి కూడా అదే గతి పడుతుందని చెప్పారు.

చంద్రబాబుకు నైతిక విలువలు లేవని… గతంలో అనైతికంగా ఎమ్మెల్యేలను కొని ఎన్టీఆర్ ను ఎలా దించేశారో అందరికీ తెలుసని అన్నారు. సీటు ఇస్తేనే ఓటు వేస్తామని ఈ ఎమ్మెల్యేలు అడిగారని… మీకు సీటు ఇవ్వలేనని జగన్ నిజాయతీగా చెప్పారని… ఒక ఎమ్మెల్సీ సీటు పోయినా సరే తనకు వ్యక్తిత్వమే ముఖ్యమని జగన్ అనుకున్నారని కొనియాడారు.

Related posts

ఏపీకి మూడు రాజధానుల అంశం కేంద్రం పరిధిలో లేదు: కేంద్రమంత్రి అథవాలే!

Drukpadam

ఖమ్మంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉద్రిక్త …పువ్వాడ వర్సెస్ పొంగులేటి…

Drukpadam

సావర్కర్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి ఉద్ధవ్ థాకరే వార్నింగ్!

Drukpadam

Leave a Comment