జర్నలిస్టులకు ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతం!
– ఆర్ జె సి , ఎస్ బి ఐ టి విద్యాసంస్థల చైర్మన్ ఆర్ జె సి కృష్ణ సౌజన్యంతో వైద్య శిబిరం
– ఆయుర్వేద వైద్యం అందించిన డాక్టర్ పాములపర్తి రామారావు
ఆర్ జె సి , ఎస్ బి ఐ టి విద్యాసంస్థల చైర్మన్, జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆర్ జె సి కృష్ణ సౌజన్యంతో ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, టి యు డబ్ల్యూ జే (ఐ జేయు) ఖమ్మం నగర అధ్యక్షులు మైస పాపారావు సారధ్యంలో జర్నలిస్టులకు ఏర్పాటుచేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం విజయవంతమయ్యింది. ఆదివారం ఖమ్మం నగరంలోని ఆర్ అండ్ బి విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని టి యు డబ్ల్యూ జే (ఐ జే యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు కే . రామ్ నారాయణ, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి కనకం సైదులు, ఖమ్మం నగర కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాస్, ఆర్ జె సి, ఎస్ బి ఐ టి విద్యాసంస్థల చైర్మన్ , బీఆర్ఎస్ జిల్లా నాయకులు ఆర్ జె సి కృష్ణ, సమాచార శాఖ జిల్లా కార్యాలయం ఏపీఆర్ఓ వల్లోజు శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కే రామనారాయణ మాట్లాడుతూ ఖమ్మం ప్రెస్ క్లబ్, టి యు డబ్ల్యూజే ఐజేయు ఖమ్మం నగర కమిటీ ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య శిబిరం జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. జర్నలిస్టుల కోసం మరిన్ని వైద్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యాలను కాపాడటం నేటి ఆధునిక సమాజంలో ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఆయుర్వేద వైద్య శిబిరాన్ని నిర్వహించేందుకు సహకరించిన ఆర్ జె సి కృష్ణకు యూనియన్ తరపున, ప్రెస్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలకు సుమారు 250 మందికి ప్రముఖ ఆయుర్వేద డాక్టర్ పాములపర్తి రామారావు వెన్నెముక, డిస్క్, కండరాల సమస్యలకు తన చేతి వైద్యంతో పరిష్కారం చూపారు. అవసరమైన వారికి ఆయుర్వేద మందులు వాడాలని సలహా ఇచ్చారు. అనంతరం ఆయుర్వేద వైద్యులు డాక్టర్ పాములపర్తి రామారావును శాలువాలు , బొకేలతో జర్నలిస్టులు , సంఘ నాయకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జేయు జిల్లా నాయకులు గోగి రెడ్డి శ్రీనివాసరెడ్డి, ఏగినాటి మాధవరావు, మహేందర్, పోటు శ్రీనివాస్, రామకృష్ణ, రాయల బసవేశ్వర రావు, ఏలూరి వేణుగోపాల్, జనార్ధన చారి, ఖమ్మం ప్రెస్ క్లబ్ కోశాధికారి నామా పురుషోత్తం, రమేష్, వెంకట్ రాజు, మధులత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు, జర్నలిస్టుల కుటుంబాలు పాల్గొన్నాయి.