Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కష్టాల్లో ఉన్న స్నేహితునికి ఆర్థిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు

వార్త రిపోర్టర్ మేకల నాగరాజు

కష్టాల్లో ఉన్న స్నేహితునికి ఆర్థిక సాయం చేసిన పూర్వ విద్యార్థులు

కాలంతో పరిగెత్తే రోజుల్లో 20 సంవత్సరాల తర్వాత స్నేహితునికి హార్దిక సహాయం అందించిన పూర్వ విద్యార్థులు

తన తో బాల్యంలో చదివిన స్నేహితులు కష్టాల్లో ఉన్న స్నేహితునికి ఆర్థిక సాయం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన పత్రికా విలేఖరి ప్రవీణ్ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదానికి గురై త్రీవర గాయాలు కాగా ఖమ్మం కిమ్స్ హాస్పిటల్ లో సుమారు నెలరోజుల పాటు చికిత్స పొంది పిండిప్రోలు గ్రామంలోని తన నివాసంలో ప్రవీణ్ విశ్రాంతి తీసుకుంటుండగా పిండిప్రోలు గ్రామంలో ప్రవీణ్ తో పాటు 1998 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు 20 సంవత్సరాల క్రితం కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు తన స్నేహితునికి కష్టం వచ్చిందని సుమారు 22 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి కాలంతో పరిగెత్తే రోజుల్లో స్నేహితులు తమ స్నేహితునికి కష్టం వచ్చిందని 20 సంవత్సరాల తర్వాత కూడా ఆర్థికంగా ఆదుకోవడం చాలా అభినందనదాయకం మిగతా విద్యార్థులు కూడా వీరిని ఆదర్శంగా తీసుకొని కష్టాల్లో ఉన్న స్నేహితులకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చల్లా వెంకటేశ్వర్ల, కుసుమ సురేష్, వేగినాటి రంగారావు, సొంటి వెంకటేశ్వర్లు, గోకినపల్లి ఉషయా, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ నిర్మాణం..భూమిని కోల్పోతున్న డీజీపీ మహేందర్‌రెడ్డి

Drukpadam

ప్రమాదంలో 186 అమెరికా బ్యాంకులు..!

Drukpadam

రామానుజుల స్వర్ణమూర్తిని లోకార్పణం చేయడం సంతోషంగా ఉంది: రాష్ట్రపతి కోవింద్!

Drukpadam

Leave a Comment