Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం ఛలో ఢిల్లీ!

చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ కోసం ఛలో ఢిల్లీ!
-ఏప్రిల్ 3 ,4 తేదీలలో ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు
-పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని డిమాండ్
-మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ

ఈరోజు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామమూర్తి ఆధ్వర్యంలో చలో ఢిల్లీ పోస్టర్లను మాజీ ఎమ్మెల్సీ సీనియర్ బీసీ రాష్ట్ర నాయకులు టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ ,పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వర రావు , ఆవిష్కరించారు ఈ సందర్భంగా బాలసాని లక్ష్మి నారాయణ మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీ లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించెల్లని డిమాండ్ చేశారు . బీసీలను ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఎదిగే విధంగా ప్రభుత్వాలు చూడాలని కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ కేటాయించాలన్నారు . ఏ వర్గాలకు లేని క్రిమిలేరు బీసీ వర్గాలకు ఎందుకని అది పూర్తిగా ఎత్తివేయాలన్నారు . ఉద్యోగుల ప్రమోషన్ లో రిజర్వేషన్లు కల్పించాలని దేశంలో జనాభా లెక్కలు సర్వే చేస్తున్నారని అందులో బీసీ కులాల లెక్కలు తీయాలన్నారు బీసీ కుల గణన చేయాలని తదితర డిమాండ్ల మీద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ శ్రీ అర్. కృష్ణయ్య నాయకత్వంలో చలో ఢిల్లీ 3,న జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమాలు జయప్రదం చేయాలన్నారు . 4న కేంద్ర మంత్రుల ఇండ్ల ముట్టడి కార్యక్రమాలు ఉంటాయని ఖమ్మం జిల్లా నుంచి అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు పిండిప్రోలు రామమూర్తిని బాలసాని లక్ష్మీనారాయణ , బొమ్మ రాజేశ్వరరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కేసోజు రఘుబాబు ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు చంద్రకాని రమణ యాదవ్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి చేన్నోజు పుల్లయ్య మహిళా అధ్యక్షురాలు నలమాస సుగుణ ఆఫీసు ఇంచార్జి పోతగాని రమణ కుమార్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు లగిశెట్టి మహేష్ నగర ప్రధాన కార్యదర్శి కేతన బోయిన నాగేశ్వరరావు జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శ్రీనివాస్ నగర కార్యదర్శి గజవెల్లి లక్ష్మీ వరప్రసాద్ నరసింహారావు మొరం పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైద్రాబాద్ లో ట్రాఫిక్ రూల్స్ కఠినతరం…కట్టుతప్పితే కఠినంగా ఫైన్ !

Drukpadam

తిరుపతిలో విచారణ ప్రారంభించిన సిట్‌ బృందం…

Ram Narayana

రోడ్ ప్రమాదాలకు కొత్త భాష్యం చెప్పిన మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే !

Drukpadam

Leave a Comment