Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ … ఇటీవల తుమ్మల తో భేటీ పై జిల్లాలో ఉత్కంఠత …

ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ … ఇటీవల తుమ్మల తో భేటీ పై జిల్లాలో ఉత్కంఠత …
-జిల్లాలో పెను రాజకీయ మార్పుల దిశగా ఆలోచనలు
-ఇటీవలనే ఖమ్మం నుంచి తుమ్మలను హెలికాఫ్టర్ లో వెంట తీసుకోని వెళ్లిన కేసీఆర్ ..
-పొంగులేటి వల్ల జరుగుతున్న నష్ట నివారణ చర్యలపై భారీ స్కేచ్
-గెలిచే అభ్యర్థులకే టిక్కెట్లు …జిల్లాలో వామపక్షాలకు చోటు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 10 కి 10 అసెంబ్లీ సీట్లే లక్ష్యంగా బీఆర్ యస్ అధినేత , సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు . అందులో భగంగానే ఇటీవల తుమ్మలను ఖమ్మం నుంచి హెలికాఫ్టర్ లో వెంట తీసుకోని వెళ్లిన కేసీఆర్ జిల్లాలోని కొందరు నేతలకు ఝలక్ ఇచ్చారని గుసగుసలు బయలు దేరాయి. రాష్ట్రమంతా గులాబీ జెండాకు జై కొడుతుండగా 2014 ,2018 ఎన్నికల్లో ఒక్క ఖమ్మం ఉమ్మడి జిల్లానే నిరాశ పరిచింది . దీనిపై కేసీఆర్ అప్పట్లోనే రగిలి పోయారు . మన కత్తులు మనల్నే పొడిచాయని మండి పడ్డారు . నాటి నుంచి కొందరు నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు . పార్లమెంట్ ఎన్నికల్లో పొంగులేటికి కారణాలు ఏమైనా టికెట్ కూడా ఇవ్వలేదు . తర్వాత ఇస్తానన్న రాజ్యసభకు ఆయనపేరు కనీసం పరిశీలన కూడా చేయలేదు … పొంగులేటి పార్టీకి దూరమైయ్యారు . జిల్లాలో విస్తృత పర్యటనల ద్వారా ప్రజలు దగ్గరైయ్యారు . అనేక మంది బీఆర్ యస్ శ్రేణులు , ఎంటీసీలు , జడ్పీటీసీలు , ఎంపీపీలు , కౌన్సిలర్లు , కార్పొరేటర్లు , కొత్తగూడం జడ్పీ చైర్మన్ , వైరా మున్సిపల్ చైర్మన్ , రాష్ట్రమార్కెటింగ్ శాఖ వైస్ చైర్మన్ ఇంకా అనేకమంది సొసైటీ ప్రసిడెంట్లు , డైరెక్టర్లు , వందలాది మంది ఆయన వెంట నడుస్తున్నారు . ఒక రకంగా చెప్పాలంటే జిల్లాలో బీఆర్ యస్ బాగా డ్యామేజ్ అయింది. ఇప్పుడున్న నాయకత్వం పార్టీని ఐక్యం చేసి బలోపేతం చేయడంలో వైఫల్యం చెందిందనే అభిప్రాయాలు బలంగా ఉన్నాయి. ఇంటలిజెన్స్ నివేదికలు కూడా సీఎం కు అదే ఇచ్చినట్లు సమాచారం …

జిల్లాలో పొంగులేటి దూకుడు కట్టడి చేయడంతో పటు రానున్న ఎన్నికలను దీటుగా ఎదుర్కొనాలంటే జిల్లాపై పట్టున్న నేతలను దగ్గరకు తీయాలనే ఉద్దేశంతో సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతి భవనం లో జిల్లాకు చెందిన మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలిచి జిల్లా రాజకీయాలపై చర్చినట్లు సమాచారం … అదే సందర్భంలో సీతారామ ప్రాజక్టు పై కూడా ఉన్నతాధికారులతో తుమ్మల సమక్షంలోనే సీఎం సమీక్ష జరిపారు . ఎలాంటి
మొఖమాటాలకు, తావు లేకుండా తిరిగి బీఆర్ యస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం గా కేసీఆర్ చర్యలకు శ్రీకారం చుట్టారు. దీంతో జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు అవకాశాలు ఉండవచ్చునని పరిశీలకుల అభిప్రాయం … గెలిచే అభ్యర్థులకే టికెట్స్ ఇవ్వడంతోపాటు ,వామపక్షాలకు చోటు కల్పించాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు …. ఇందుకోసం మరో సారి జిల్లా ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలనీ సీఎం నిర్ణయించినట్లు తెలుస్తుంది ….

Related posts

అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు…అసలు రహస్యమేమిటి ….!

Drukpadam

రాజ్యసభలో 100 మార్క్ దిగువకు బీజేపీ.. పార్టీల బలాబలాలు ఇవీ..!

Drukpadam

అమ‌రావ‌తి రైతులు చేసింది త్యాగ‌మెలా అవుతుంది?: మంత్రి బొత్స 

Drukpadam

Leave a Comment