Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

23 ఏళ్లకే బళ్లారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన యువతి!

23 ఏళ్లకే బళ్లారి మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన యువతి!

  •  ఫార్మసీలో డిప్లొమా పూర్తి చేసిన త్రివేణి
  • 18 ఏళ్లకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి
  • 21 ఏళ్లకే కార్పొరేటర్‌గా విజయం
  • డిప్యూటీ మేయర్‌గా బి.జానకి

18 ఏళ్ల వయసులోనే ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టిన ఓ యువతి 23 ఏళ్లకే ఓ నగరానికి మేయర్ అయ్యారు. ఆమె పేరు డి. త్రివేణి. కర్ణాటకలోని బళ్లారి నగర పాలికె మేయర్‌గా నిన్న విజయం సాధించి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీతో 18 ఏళ్లకే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన త్రివేణి ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి కార్పొరేటర్‌గా విజయం సాధించారు.

నిన్న జరిగిన మేయర్ ఎన్నికల్లో విజయం సాధించి అతి పిన్న వయసులోనే బళ్లారికి మేయర్ అయిన ఘనత సాధించారు. ఫార్మసీలో డిప్లొమా పూర్తిచేసిన త్రివేణి ఏడాది పాటు మేయర్‌గా కొనసాగుతారు. ఆమె తల్లి సుశీలాబాయి కూడా 2019-20 మధ్య బళ్లారి మేయర్‌గా పనిచేశారు.

ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. తాను 21 సంవత్సరాలకే కార్పొరేటర్‌గా విజయం సాధించానని, ఇప్పుడు 23 ఏళ్ల వయసులో మేయర్ అయినట్టు చెప్పారు. అందరినీ కలుపుకుంటూ నగరాభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. కాగా, డిప్యూటీ మేయర్‌గా బి.జానకి ఎన్నికయ్యారు. 33వ వార్డు సభ్యురాలైన జానకి డిప్యూటీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Related posts

జైయహో తీన్మార్ మల్లన్న జైయహో…

Drukpadam

రజనీకాంత్‌ కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్లే: రామ్ గోపాల్ వర్మ!

Drukpadam

కమ్యూనిస్టులు లేకుండా ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ జెండా ఎగురుతుందా …?

Drukpadam

Leave a Comment