Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య మార్పు.. నిర్మలా సీతారామన్ తో భేటీ!

జగన్ ఢిల్లీ పర్యటనలో అనూహ్య మార్పు.. నిర్మలా సీతారామన్ తో భేటీ!

  • నిన్న రాత్రి అమిత్ షాను కలిసిన ఏపీ సీఎం
  • షా నివాసంలో దాదాపు 40 నిమిషాలు చర్చలు
  • ఈ ఉదయం చివరి నిమిషంలో ఖరారైన నిర్మాల అపాయింట్ మెంట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన షెడ్యూల్ లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగానే అనుకున్న విధంగా బుధవారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను జగన్ కలిశారు. అమిత్ షా నివాసంలో సుమారు 40 నిముషాల పాటు ఈ సమావేశం జరిగింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఉదయం 9:30 గంటలకు జగన్ విజయవాడకు బయలుదేరుతారని మీడియాకు సమాచారం ఇచ్చారు కానీ, పర్యటనలో మార్పు చేసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తో కూడా జగన్ భేటీ అయ్యారు. తొలుత నిర్మల అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో ఉదయాన్నే ఏపీ బయల్దేరాలని జగన్ భావించారు.

కానీ, చివరి నిమిషంలో రావాలని జగన్‌కి సీతారామన్ నుంచి పిలుపు అందినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో  జగన్.. ఆమెతో సమావేశం అయ్యారు.  కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ తో జగన్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో పెండింగ్ సమస్యలపై , రావాల్సిన బకాయిలు ,పోలవరం నిధులు పై సవివరంగా చర్చినట్లు సమాచారం ..    మరో రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో పెండింగ్‌ నిధులతోపాటు గ్రాంట్లు విడుదల చేయాలని నిర్మలను జగన్‌ కోరినట్లు తెలుస్తోంది. కాగా, 15 రోజుల వ్యవధిలో జగన్‌ ఢిల్లీకి వెళ్లడం ఇది రెండోసారి. ఈ నెల 17వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఆయన చర్చలు జరిపారు. వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో  కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న సమయంలో జగన్ ఢిల్లీ పర్యటనలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.  ఆయన మరికొద్ది సేపట్లో తిరిగి ఏపీకి పయనం కానున్నారు .

Related posts

మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం.. కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్న సీఎం!

Drukpadam

పాతబస్ స్టాండ్ ఉండాల్సిందే టీపీసీసీ చీఫ్-ఉత్తమ్ కుమార్ రెడ్డి…

Drukpadam

బైడెన్ ఉక్రెయిన్ ప్రయాణం ఆద్యంతం రహస్యమే..!

Drukpadam

Leave a Comment