Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ మరో మారు మంత్రివర్గ విస్తరణ చేయనున్నారా …?

జగన్ మరో మారు మంత్రివర్గ విస్తరణ చేయనున్నారా …?
ఏపీలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు …
ఏప్రిల్ 3 న మంత్రులు ,ఎంపీలు ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలతో కీలక సమావేశం …
పట్టభద్రులు , ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష
40 మంది ఎమ్మెల్యేలకు జగన్ టికెట్స్ ఇవ్వడంలేదని ప్రచారం ..
మూడు రాజధానులు ..కోర్ట్ వాయిదాలపై తర్జన భర్జన
రాష్ట్ర రాజధానుల నిర్ణయంపై ఇప్పటికే హైకోర్టు కు అఫిడవిట్ ఇచ్చిన కేంద్రం ..
సంక్షేమ పథకాల అమలు …రాష్ట్ర అభివృద్ధిపై దిశా నిర్దేశం …
ఢిల్లీ పర్యటనలు …కేంద్ర సహకారంపై సమాలోచనలు

ఏపీ సీఎం జగన్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారనే వార్తలు వస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల ఎమ్మెల్సీలకు జరిగిన ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో పార్టీని, మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనీ సీఎం జగన్ ఆలోచనకు వచ్చారా ? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. అందువల్ల మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు . కొందరు మంత్రులను మార్చడంద్వారా కొత్తవారికి ఇప్పటివరకు చోటు దొరకని కులాలవారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వనున్నారని విశ్వసనీయమైన సమాచారం .. అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా మరో 13 నెలలే ఉండటంతో మార్పు ఉండాలని జగన్ కోరుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకోసం తీవ్రంగా కసరత్తు చేస్తున్నారని కూడా అంటున్నారు . రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ వైఖరిని నాయకులకు , మంత్రులకు , ఎంపీలు ఎమ్మెల్యేలకు వివరించేందుకు సీఎం జగన్ ఏప్రిల్ 3 న కీలక సమావేశం ఏర్పాటు చేయబోతున్నారని సమాచారం .ఒక వేళ ఆరోజు సాధ్యం కాకపోతే త్వరలోనే సమావేశం ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. అందులో ఢిల్లీ పర్యటనలు , కేంద్రం అందిస్తున్న సహాయసహకారాలు , ఎన్నికలు, ఇంటలిజెన్స్ నివేదికల , సర్వే లు సమాచారాన్ని నియోజకవర్గాలవారీగా వెల్లడించాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయసమాచారం . ఇప్పటికే సీఎం జగన్ కు అందిన సర్వేలు ఇతర నివేదికల ఆధారంగా 40 నుంచి 50 మందికి టికెట్స్ ఇవ్వడంలేదని ప్రచారం జరుగుతుంది. ఇందులో కొంతమందిపై నెగిటివ్ రిపోర్టులు ఉండగా , మరికొందరు తాము తప్పుకొని తమ వారసులకు టికెట్స్ ఇవ్వమని ఆడుతున్నారని అంటున్నారు . టికెట్స్ విషయంలో గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు . టికెట్స్ ఇవ్వలేని వారికీ ఈసారి మీకు టికెట్ ఇవ్వలేమన్నా, అంటూ నిర్మొహమాటంగా చెపుతున్నారని అంటున్నారు . మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో కూడా జరిగింది ఇదే. ఉండవల్లి శ్రీదేవికి కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదనే ఉద్దేశంతోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేశారని అంటున్నారు .

మూడు రాజధానుల విషయంలో ప్రభుత్వ నిర్ణయానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్రప్రభుత్వం సుప్రీం కు వెళ్ళింది. అక్కడ త్వరగా విచారణ జరిగి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రప్రభుత్వానికి రాజధాని నిర్ణయించుకునే అధికారం ఉంటుందని తీర్పు వస్తుందని ఆశాభావంతో ఉంది . అయితే కోర్ట్ వాయిదాల వలన ఆలశ్యం అవుతుండటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.

రాష్ట్రంలో 151 సీట్లు గెలుచుకొని అద్భుతమైన విజయం సాధించిన వైకాపా తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఘన విజయాలు సాధించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 నుంచి 90 శాతం సీట్లను గెలుచుకుంది. వైకాపాకు తిరుగులేదని తిరిగి అధికారం చేపట్టడం ఖాయమని చర్చ జరుగుతున్నవేళ పట్టభద్రుల , ఎమ్మెల్యేల నుంచి ఎమ్మెల్సీల ఎన్నికల్లో బోల్తాపడి షాక్ గురైంది . అతి నమ్మకమో , లేక వారి తప్పిదాలో తెలియదు కానీ వైకాపా లెక్కతప్పింది . కీలకమైన పట్టభద్రుల ఎన్నికలు వైకాపా ప్రభుత్వానికి మంచి గుణపాఠం నేర్పాయి.వైకాపాకు తిరుగులేని బలం ఉన్న రాయలసీమలోని రెండు పట్టభద్రుల స్థానాలు ఓడిపోవడమే కాకుండా , ఉత్తరాంధ్ర శ్రీకాకుళం , విజయనగరం , విశాఖపట్నం జిల్లాల పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి వైకాపాకు విశాఖ రాజధాని వాయిస్ ను తగ్గించింది . అన్ని ప్రాంతాల అభివృద్ధి వికేంద్రకరణతో సాధ్యమని నమ్ముతున్న వైకాపా నినాదాన్ని ప్రజలు నమ్మడంలేదని తేలిపోయిందని ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయి .

అయినా తాము ప్రజలకు ,ప్రధానంగా పేదలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలు ,అభివృద్ధి కార్యక్రమాలు ,ఎన్నికల ప్రణాళిక అమలు తమకు ఓట్లు రాల్చి పెడుతుందని వైకాపా నమ్ముతుంది . దీనిపైనా పార్టీ విస్తృత సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఒకరకంగా చెప్పాలంటే 151 అసెంబ్లీ సీట్లు గెలిచామని ధీమాగా ఉన్న వైకాపా కు ఎమ్మెల్సీ ఎన్నికలు ఝలక్ ఇవ్వడంతో పార్టీని అలర్ట్ చేసేందుకు జగన్ సిద్ధమైయ్యారు ….గత 15 రోజుల్లోనే రెండుసార్లు ఢిల్లీ వెళ్లన జగన్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సమస్యలు పోలవరం బిల్లులు విషయంలో ప్రధాని మోడీ , హోమ్ మంత్రి అమిత్ షా , ఆర్ధికమంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి విజ్ఞప్తి చేశారు . దీనిపై కూడా పార్టీ సమావేశంలో వివరించనున్నట్లు తెలుస్తుంది….

Related posts

బీసీలను బానిసలు అంటావా? క్షమాపణ చెప్పాల్సిందే: ఈటలపై ఎల్.రమణ ఫైర్!

Drukpadam

పార్టీ మారుతున్నారన్న వార్తలపై ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్…

Drukpadam

టీఆర్ యస్ ,బీజేపీ లమధ్య డ్రామానా ?రైతులకోసం కదా ?

Drukpadam

Leave a Comment