Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మహాత్మాగాంధీ చూపిన బాటలో బీజేపీని పారదోలాలి…సీఎల్పీ నేత భట్టి!

మహాత్మాగాంధీ చూపిన బాటలో బీజేపీని పారదోలాలి…సీఎల్పీ నేత భట్టి!
-పేదలకు భారాలు …సంపన్నులకు రాయితీలు ఇస్తున్న బీజేపీ
-దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్న బీజేపీ
-ప్రధాని మోడీ ,అమిత్ షా లు ఆర్థిక దోపిడీదారులకు కొమ్ముకాస్తున్నారు
-మతం ,ప్రాంతాల పేరుతో ప్రజల్లో చిచ్చుపెడుతున్నారు
-వారినుంచి దేశ సమగ్రత , సమైక్యతను కాపాడాలి ..
-బంగారు తెలంగాణ అని చీకటి తెలంగాణ చేసిన బీఆర్ యస్ కు బుద్ది చెప్పాలి ..

దేశాన్ని విచ్ఛన్నం చేస్తూ , దేశసంపదను కొల్లగొడుతూ ,సంపన్నులకు రాయితీలు ఇస్తున్న బీజేపీని గద్దెదింపాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు . శుక్రవారం బెల్లం పల్లి లో జరిగిన పాదయాత్ర సందర్భంగా మీడియా తో మాట్లాడిన భట్టి బీజేపీ అప్రజాస్వామిక విధానంపై ధ్వజమెత్తారు . తమ అగ్రనేత రాహుల్ గాంధీని అదానీ వ్యహారంలో రాహుల్ గొంతు నెక్కేందుకే పార్లమెంట్ నుంచి అనర్హత వేటు వేసి పంపించారని ధ్వజమెత్తారు .బీజేపీ విధానాలు దేశ సార్వభౌమత్వానికి పెనుముప్పుగా మారాయని విమర్శించారు . రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం , ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం , ప్రజలను మతాలు , ప్రాంతాల పేరుతోతో విడగొట్టడం బీజేపీ విధానంగా మారిందన్నారు . దేశంలో ప్రజాస్వామ్యం ఫరడవిల్లాలంటే బీజేపీ ని ఓడించాలని అన్నారు . బీజేపీ విధానాలతో సామాన్యుల బ్రతుకులు దుర్భరం అయ్యానని దుయ్యబట్టారు . ధరల పెరుగుదల ,మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లాంటి వాటిపట్ల బీజేపీ వ్యహరిస్తన్నా తీరు పేదలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు .

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ ప్రభుత్వం నీరు ,నిధులు ,నియామకాలు అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని తుంగలో తొక్కిందని విమర్శించారు . కుంభకోణాలు ,పేపర్ లీకేజీలు ,ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం లాంటి విధానాలతో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటుందని విమర్శలు గుప్పించారు . భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు కనీస సదుపాయాలను కల్పించడం లో ఘోరంగా విఫలమైందని అన్నారు . బంగార తెలంగాణ అని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని ప్రజల్లో బీఆర్ యస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రజా చైతన్యం ద్వారా దానికి తగిన బుద్ధిచెప్పాలని పిలుపు నిచ్చారు .

హత్ సే హత్ జోడో యాత్రలో భాగంగా పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్న భట్టి పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. పాదయాత్ర దారిపొడవునా గ్రామాలు,పట్టణాల గుండా సాగుతుంది . డప్పు కళాకారుల సందడి ,కోలాటం తో పాదయాత్ర సందడిగా సాగుతుంది. తమ సమస్యలను ప్రజలు భట్టికి చెప్పుకుంటున్నారు . అనేకమంది అర్జీలు ఇస్తున్నారు . వారి సమస్యలను శ్రద్దగా వింటూ ముందుకు సాగుతున్నారు . వేలమంది ఆయన వెంట నడుస్తున్నారు . కాంగ్రెస్ శ్రేణులు భట్టి పాదయాత్రలో పాల్గొంటున్నారు .

Related posts

సీఎం యోగి ఆదిత్యనాథ్ పై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన అఖిలేశ్ యాదవ్!

Drukpadam

హుజురాబాద్ ఆపరేషన్ నేరుగా రంగంలోకి దిగిన హరీష్ రావు!

Drukpadam

ఫిరాయింపుల మాస్టర్ కేసీఆర్…కిషన్ రెడ్డి విమర్శ!

Drukpadam

Leave a Comment