Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆర్టీసీ చార్జీల పెంపు…నేరంనాదికాదు కేంద్రానిది అంటున్న రాష్ట్రం..

ఆర్టీసీ చార్జీల పెంపు…నేరంనాదికాదు కేంద్రానిది అంటున్న రాష్ట్రం…
-కేంద్రంపై రాష్ట్రం …రాష్ట్రంపై కేంద్రం నిందలు
-వాతలు మాత్రం ప్రజలపైన …లబోదిబోమంటున్న ప్రయాణికులు
-టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులనెత్తిన ‘టోల్’ .. అమల్లోకి కొత్త చార్జీలు
-టోల్ చార్జీలను ఐదు శాతం పెంచిన కేంద్రం
-గరుడ ప్లస్ నుంచి ఆర్డినరీ బస్సుల్లో టికెట్‌పై అదనంగా రూ. 4 పెంపు
-నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున పెంపు
-టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సిటీ బస్సుల్లోనూ రూ. 4 వడ్డింపు
-వాహనాల సంఖ్య భారీగా పెరిగిన టోల్ చార్జీలు పెంచడంపై అసంతృప్తి

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల నెత్తిన నేటి నుంచి అదనపు భారం పడనుంది. ఇటీవల కేంద్రం పెంచిన ఐదుశాతం టోల్ చార్జీలను ప్రయాణికుల నుంచి వసూలు చేయాలని నిర్ణయించింది. నేటి నుంచే ఇది అమల్లోకి రానుండడంతో ప్రయాణికులు అదనంగా చెల్లించుకోక తప్పదు. ఇది ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తికి కారణమవుతుంది.

ఆర్టీసీ టిక్కెట్ల రేట్లు మళ్ళీ పెంచింది …కాకపోతే బస్సు చార్జీల పెంపు నేరం నాదికాదు కేంద్రానిదని అంటుంది . నేషనల్ హైవే పై ఉన్న టోల్ గేట్స్ దగ్గర వసూల్ చేస్తున్న చార్జీల పెంపుకు గ్రీన్ సిగ్నలు ఇస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఏప్రిల్ 1 వ తేదీనుంచి టోల్ చార్జీలను 5 శాతం పైగా పెంచారు . దీంతో ఆర్టీసీ బస్సు లు కూడా టోల్ చార్జీలు పెరిగినందున భారం ప్రయాణికులపై వేశాయి. అటు కేంద్రం ,ఇటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల ప్రయాణికులపై భారం పడుతుంది. అసలు టోల్ చార్జీలు పెంచాల్సిన అవసరం ఏమిటి ? టోల్ చార్జీలు పెంచకుండానే పెరిగిన వాహనాల సంఖ్యతో టోల్ దగ్గర ఎక్కువగానే వసూల్ అవుతున్నాయి. అయినప్పటికీ ప్రజలపై భారాలు మోపడం పాలకుల వైఖరిని తెలియజేస్తుంది. ప్రతి ప్రయాణికుడిపై ఆర్డనరీ బస్సు లో ప్రయాణిస్తే అదనంగా 4 రూపాయలు …ఎక్స్ ప్రెస్ కు 15 రూపాయలు , రాజధాని ,గరుడ , ఇతర బస్సు లకు 20 రూపాయలవరకు పెంపుదల ఉండటంతో ప్రయాణికులు లబోదిబో అంటున్నారు .

గరుడ ప్లస్ మొదలు ఆర్డినరీ బస్సుల వరకు ఒక్కో టికెట్‌పై 4 రూపాయలు, ఇటీవల ప్రవేశపెట్టిన నాన్ ఏసీ స్లీపర్ బస్సులో రూ. 15, ఏసీ స్లీపర్ బస్సుల్లో రూ. 20 చొప్పున టోల్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, టోల్ ప్లాజా మీదుగా ప్రయాణించే సిటీ ఆర్డినరీ బస్సుల్లోనూ అదనంగా రూ. 4 వసూలు చేయనున్నారు.

Related posts

అధికారం తలకెక్కింది.. దేశానికి క్షమాపణలు చెప్పండి: నుపుర్ శర్మపై సుప్రీంకోర్టు ఆగ్రహం…

Drukpadam

లండన్‌లో మరో భారత సంతతి వ్యక్తి హత్య!

Drukpadam

ఆకతాయిల పిల్ల చేష్టలు :రంగంలోకి దిగిన రామగుండము సీపీ!

Drukpadam

Leave a Comment