Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజు నివాసం వద్ద హైడ్రామా… అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!

రఘురామకృష్ణరాజు నివాసం వద్ద హైడ్రామా… అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు!
రఘురామ వర్సెస్ ఏపీ సర్కారు
సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న రెబల్ ఎంపీ
కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ
రఘురామ నివాసంలో గంటపాటు వాగ్యుద్ధం

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వంపైనా, సీఎం జగన్ పైనా తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారుకు చర్యలకు ఉపక్రమించింది. నేడు హైదరాబాదులోని రఘురామకృష్ణరాజు నివాసానికి ఏపీసీఐడీ అధికారులు వెళ్లారు. నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే, రఘురామకృష్ణరాజుకు భద్రత కల్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్ ను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. సీఆర్పీఎఫ్ జవాన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని రఘురామను కవర్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ అధికారులకు, రఘురామకు మధ్య గంటపాటు తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం జరిగింది. అనంతరం ఏపీ సీఐడీ అధికారులు ఆయనను తమ వెంట జీపులో తీసుకెళ్లారు. కాగా రఘురామకృష్ణరాజుపై 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇవాళ రఘురామకృష్ణరాజు పుట్టినరోజు అని తెలిసిందే.
రఘురామ కృషం రాజు వైసీపీ ఎంపీ గా ఉంటూ ఆయన నిత్యం ప్రభుత్వంపైనా ముఖ్యమంత్రి జగన్ పైన రచ్చబండ పేరుతో తిట్టి పోయడం దాన్ని కొందరు అందించడం తెలిసిందే . ఆయన పార్టీతో విభేదించటంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు . అది ఆయన వ్యక్తిగత నిర్ణయం . అయితే ఎంపీగా ఆయన ఒక పార్టీ నుంచి ఎన్నికై దాన్ని దూషించడం సరైంది కాదు . పార్టీని ప్రభుత్వాన్ని దిగజార్చడం ఆయన ఉద్దేశంగా కనపడుతుంది.దీనిపై ఆయన్ను డిస్ క్వాలిఫయ్ చేయమని పార్టీ స్పీకర్ను కోరింది. కాని స్పీకర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. గత సంవత్సర కాలంపైగా ఆయన కొన్ని ఛానళ్లలో ప్రత్యక్షమై వైసీపీ , ఏపీలోని ప్రభుత్వాన్ని తూర్పార పట్టడం ,ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించడం పనిగా పెట్టుకున్నారు. అందుకు ప్రభుత్వ వ్యతిరేక చాన్నాళ్లుగా ముద్రపడిన వారు ఆయనతో ఎంట్రటైన్ మెంట్ ప్రోగ్రాం మారింది. అయితే మొదట్లో కొత్త స్పందన వచ్చిన ఇప్ప్డుడు అది కొరవడింది. ఇంతకాలం ఆయన తలనొప్పిని భరించిన ప్రభుత్వం చివరకు అరెస్ట్ చేసింది.ఏమి జరుగుతుందో చూద్దాం !

Related posts

ఢీ అంటే ఢీ అంటున్న వైరి వర్గాలు …అందరి చూపు పాలేరు వైపు …

Drukpadam

టీడీపీలో చేరేందుకు చంద్రబాబుతో మాట్లాడుకున్న ఎమ్మెల్యే శ్రీదేవి ….

Ram Narayana

వైసీపీలో జయప్రకాశ్ నారాయణ చేరబోతున్నారా? లోక్ సత్తా స్పందన ఏమిటి?

Ram Narayana

Leave a Comment