Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ!

జైలు నుంచి విడుదలైన నవజ్యోత్ సింగ్ సిద్ధూ!

  • 34 ఏళ్ల నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష
  • వాస్తవానికి మే నెలలో విడుదల కావాల్సిన సిద్ధూ
  • సత్ప్రవర్తన కారణంగా ముందే విడుదల
  • పాటియాలా జైలు నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన సిద్ధూ

34 ఏళ్ల నాటి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూకు విముక్తి కలిగింది. సత్ర్పవర్తన కారణంగా సిద్ధూ ముందుగానే విడుదలయ్యారు. ఈ సాయంత్రం ఆయన పాటియాలా జైలు నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు.

1988లో సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సింగ్… ఓ పార్కింగ్ వివాదంలో గుర్నామ్ సింగ్ అనే వృద్ధుడిపై చేయిచేసుకున్నట్టు అభియోగాలు ఎదుర్కొన్నారు. గుర్నామ్ సింగ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. దాంతో ఆయన గతేడాది కోర్టు ఎదుట లొంగిపోయాడు.

ఇటీవల సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ క్యాన్సర్ బారినపడింది. ఈ కష్టకాలంలో భర్త తన వెంట ఉండాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు.

కాగా, సిద్ధూ స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చిన నేపథ్యంలో, ఆయన రాజకీయ భవితవ్యం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి అనంతరం పంజాబ్ పీసీసీ చీఫ్ పదవి నుంచి సిద్ధూ తప్పుకున్నారు. అటు, పార్టీలో లుకలుకల నేపథ్యంలోనూ ఆయన కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహానికి గురయ్యారు.

Related posts

 మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై ఎల్ అండ్ టీ కీలక ప్రకటన

Ram Narayana

వైఎస్ మరణంలో చంద్రబాబు కుట్ర ఉందేమోనని డౌటు: ఎంపీ మోపిదేవి

Drukpadam

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే తిక్క సమాధానం తరిమికొట్టిన జనం …

Drukpadam

Leave a Comment