అనర్హత వేటుతో పెరిగిన రాహుల్ గాంధీ గ్రాఫ్….!
-జాతీయ ,అంతర్జాతీయ మీడియా ను ఆకర్షించిన రాహుల్ పై వేటు వార్త
-రాహుల్ పై చర్యలను తాము గమనిస్తున్నామన్న ఐక్యరాజ్యసమతి
-కోర్ట్ తీర్పును తాము పరిశీలిస్తున్నట్లు తెలిపిన అమెరికా
-అదే స్థాయిలో స్పందించిన జర్మనీ …
-రాహుల్ కు ఒకన్యాయం ….బీజేపీ ఎమ్మెల్యేలకు మరో న్యాయమా ? అనే దానిపై చర్చ …
-కర్ణాటకలో కోర్ట్ శిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యేలపై లేని అనర్హత వేటు!
-రాహుల్ గాంధీ విషయంలో 24 గంటలు తిరక్క ముందే అనర్హత
-చివరకు రాహుల్ ఉంటున్న అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలనీ నోటీసులపై ప్రజల్లో అసంతృప్తి
-ఇది బీజేపీకి ముమ్మాటికీ లాభం కన్నా నష్టమనే అభిప్రాయాలు…
రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడం బీజేపీకి లాభమా …? నష్టమా …? అంటే కచ్చితంగా నష్టమనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. రాహుల్ పై చర్యలను అంతర్జాతీయ మీడియా ను సైతం ఆకర్షించింది . ఇది బీజేపీకి మైనస్ గా మారగా రాహుల్ గాంధీ గ్రాఫ్ అనూహ్య రీతిలో పెరిగింది. ఇటీవల కాలంలో ఇంతటి పాపులారిటీ ఏ రాజకీయనాయకుడికి రాలేదంటే అతిశేయోక్తి కాదు . ఏ నోటా విన్న …ఏ టీవీ చూసినా, ఏ మీడియా కథానాలైన ఒకటే మాట …ఇదెక్కడి న్యాయమని … అంతేకాకుండా అధికార పార్టీకి ఒకన్యాయం…. ప్రతిపక్షానికి మరొక న్యాయమా …? అంటూ ప్రశ్నల వర్షం… రాహుల్ గాంధీకి ఒక న్యాయం …? శిక్ష పడిన బీజేపీ ఎమ్మెల్యేలలకు మరో న్యాయమా …? ఇదేనా చట్టం ..?ఇదేనా న్యాయమని దేశవ్యాపితంగా నిరసనలు …స్తంభించిన పార్లమెంట్ …
రాహుల్ గాంధీ పై శిక్షపడిన వెంటనే జెట్ స్పీడ్ తో నిర్ణయంతీసుకొని ఆయన లోకసభ సభ్యత్వాన్ని రద్దుచేసి పాలకులు …మరి కర్ణాటకలో శిక్షపడిన బీజేపీ ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యతీసుకోలేదనే దానిపై సమాధానం కోసం దేశం ఎదురు చూస్తుంది.దీనిపై బీజేపీ ఇంతవరకు స్పందించలేదు…
మోదీ ఇంటిపేరును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు గాను సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్షను విధించింది. దీంతో, లోక్ సభ సెక్రటేరియట్ ఆయన ఎంపీ సభ్యత్వంపై ఆఘమేఘాల మీద నిర్ణయం తీసుకోని అనర్హత వేటు వేసింది.
మరోవైపు కర్ణాటకలోని ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులు శిక్ష విధించి రెండు నెలలు దాటిపోతున్నా వారిపై ఇంత వరకు అనర్హత వేటు వేయలేదు. అంటే అధికార పక్షానికి ఒక న్యాయం ప్రతిపక్షానికి మరో న్యాయమా…? అనే అభిప్రాయాలు సగజంగానే వ్యక్తం అవుతున్నాయి. దేశవ్యాప్తితంగా నిరసనలకు , పార్లమెంట్ స్తంభించడానికి కారణమవుతుంది. చివరకు రాహుల్ గాంధీ ఎంపీగా ఉంటున్న అధికారిక నివాస భవనాన్ని ఖాళీ చేయమనడం మరో కక్ష్యపూరిత చర్యగా ప్రజలు భావిస్తున్నారు . దేశస్వాతంత్రం కోసం పోరాడి…. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబానికి ఇచ్చే గౌరం ఇదేనా అని పౌరసమాజం ప్రశ్నలకు దాటవేత సమాధానాలే వస్తున్నాయి.
అదానీ విషయంలోపార్లమెంట్ లో ప్రశ్నింస్తుందుకే రాహుల్ గాంధీని లోకసభలో లేకుండా చేయాలనే బీజేపీలో కుట్రలో భాగంగానే అనర్హత వేటు వేశారని కాంగ్రెస్ చేస్తున్న వాదనలకు బలం చేకూరుతుంది. దీనిపై ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా రాహుల్ గాంధీకి లభిస్తుండటం విశేషం …మమతా బెనర్జీ ,నితీష్ కుమార్ , కేసీఆర్ , స్టాలిన్ , అఖిలేష్ , సిపిఐ,సిపిఎం పార్టీలు ఆర్జేడీ , జేడీయూ , ఎన్సీపీ నేషనల్ కాన్ఫరెన్స్ , పీడీఎఫ్ లాంటి అనేక పార్టీలు బీజేపీ చర్యలను ఖండిస్తున్నాయి. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలను చేపట్టింది . ఈసందర్భంగా దేశం కోసం అమరుడైన ఒక మాజీ ప్రధాని కుమారుడిపై నిందలు వేసి ,అవమాన పరిచి ఎంపీగాసభ్యత్వాన్ని రద్దు చేయడంపై రాహుల్ సోదరి ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు .
బీజేపీ ఎమ్మెల్యేలకు అనర్హత వర్తించదా…?
కాంట్రాక్టు పనుల్లో రూ. 50 లక్షల అవినీతి కేసులో నేరం రుజువుకావడంతో హావేరీ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కి రెండేళ్ల జైలు శిక్షను కోర్టు విధించింది. చిక్ మగళూరు జిల్లా మూడిగెరె బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నాలను చేస్తున్నట్లు సమాచారం .
కేరళ రాష్ట్రంలోని వైనాడ్ ఎంపీ రాహుల్ గాంధీని దోషిగా తేల్చి ఆయన చేసిన ప్రసంగానికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. రెండేళ్లు , అంతకు మించి శిక్ష పడిన చట్టసభల సభ్యుల సభ్యత్వం రద్దు అవుతుందని చట్టంలో ఉందని, అందువల్లనే రాహుల్ పై అనర్హత వేటు వేయడం జరిగిందని ఈ అనర్హతతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని సమర్ధించుకొనేందుకు చెపుతున్న మాటలు ప్రజలను ఒప్పించలేకపోతున్నాయి . కచ్చితంగా బీజేపీ కుట్రలో భాగమని , కావాలనే రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని కోర్ట్ తీర్పు పేరుతో బీజేపీనే రద్దు చేయించించిందని ప్రజలు నమ్ముతున్నారు . దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. పైగా దేశంలోని ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో రాహుల్ పై తీసుకున్న చర్యలను ఖండిస్తున్నాయి. అంతకు మూడు ఎడమొఖం ,పెడమొఖంగా ఉన్నా పార్టీలన్నీ ఈ విషయంలో ఐక్యం కావడం గమనార్హం . ఇది బీజేపీకి పెద్ద మైనస్ గా మారే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
పై కోర్టులకు వెళ్లేందుకు నెలరోజుల గడువు ఇవ్వడంతోపాటు వెంటనే బెయిల్ కూడా ఇచ్చింది శిక్ష విధించిన సూరత్ కోర్ట్ . అయినప్పటికీ రాహుల్ గాంధీకి 24 గంటలు గడవక ముందే ఆగమేఘాలమీద లోకసభ సెక్రటరీ జనరల్ అనర్హత వేటు వేయడంపై మండిపడుతున్నారు . దీనిపై దేశమే కాదు ,ప్రపంచవ్యాపితంగా నిరసనలు వ్యక్తమైయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ ప్రపంచమంతా మారుమోగుతోంది . ఇటీవల కాలంలో ప్రపంచంలో ఏ నాయకుడికి రానంత ప్రచారం వచ్చింది.ఆయన భారత్ జోడో యాత్రకు కూడా ఇంతటి ప్రచారం లభించలేదని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దేశంలోని మీడియానే కాకుండా ప్రపంచంలోని ముఖ్యమైన పత్రికలన్నీ కూడా అన్ని భాషల్లో రాహుల్ పై అనర్హత వేటును బ్యానర్ ఐటం చేశాయి. బీజేపీ సిద్ధాంత కర్తలు కూడా రాహుల్ గాంధీకి వచ్చిన ప్రచారానికి చూసి కంగు తిని ఉండవచ్చు . చివరకు ఐక్యరాజ్యసమితి సైతం రాహుల్ విషయంలో భారత ప్రభుత్వం చర్యలను తాము గమనిస్తున్నామని పేర్కొనడం విశేషం .. సోషల్ మీడియా లోను ట్విట్టర్ , ఇన్ స్టాగ్రామ్,వాట్స్ అప్ లాంటి సోషల్ మీడియా లో రాహుల్ గాంధీ పేరు ప్రముఖంగా కనిపించింది . ఎక్కసారిగా ప్రపంచం రాహుల్ గాంధీ గురించి చర్చించడం ఆయన తీసుకున్న చర్యలు ఆయన చేసిన వ్యాఖ్యలు గురించి వెతకటం ప్రారంభించారు .
భారతదేశంలో అసలు ఏమిజరుగుతుందనే విషయంపై ప్రపంచ దేశాలు ఆరా తీస్తున్నాయి. ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతున్న భారత దేశంలో ప్రతిపక్ష పార్టీలపై పాలకపక్షం కక్షపూరితంగా వ్యవహరించడంపై నిశితంగా పరిశీలన జరుగుతుంది. ఈడీ ,సిబిఐ , ఇన్ కం టాక్స్ లాంటి సంస్థలను కేందంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షపార్టీలపై ఉసిగొల్పుతుందనే విమర్శలు ఎదుర్కొంటుంది ….ఇది కచ్చితంగా బీజేపీని చిక్కుల్లోకి నెట్టిన సమస్యగా మారిందని రాజకీయపండితుల అభిప్రాయం….