Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు…

ఆర్ఎస్ఎస్ సభ్యులను ఈ శతాబ్దపు కౌరవులన్న రాహుల్ గాంధీపై పరువునష్టం కేసు…

  • ప్రధాని ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేలిన రాహుల్ గాంధీ
  • హరిద్వార్ కోర్టులో మరో కేసు 
  • థానేలో నమోదైన కేసులో హాజరు నుంచి శాశ్వత మినహాయిపు కోరిన కాంగ్రెస్ నేత

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో దోషిగా తేలి, అనర్హతకు గురైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. భారత్ జోడో యాత్ర హర్యానా చేరుకున్న తర్వాత ఈ ఏడాది జనవరి 9న అంబాలాలో రాహుల్ మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ సభ్యులను 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించారు.

రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ పిటిష్‌పై ఈ నెల 12న విచారణ జరగనుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా భీవండి మేజిస్ట్రేట్ కోర్టులో రాహుల్‌పై మరో పరువు నష్టం కేసు దాఖలైంది. ఈ కేసులో విచారణకు హాజరు కాకుండా శాశ్వత మినహాయింపు ఇవ్వాలని రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌పై ఈ నెల 15న విచారణ జరగనుంది.

Related posts

మూడు రాజధానులు …అమరావతి రాజధాని ర్యాలీలతో హీటెక్కిన తిరుపతి!

Drukpadam

లేనిదాన్ని ఉన్నట్లు ఊహించుకోవడం చంద్రబాబుకు రోగ లక్షణం …సజ్జల

Drukpadam

పొంగులేటిపై సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర ఫైర్….

Drukpadam

Leave a Comment