Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి…!

అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి…!

  • అమెరికాను బెంబేలెత్తిస్తున్న టోర్నడో
  • టోర్నడో ప్రభావానికి గురైన 50 మిలియన్ల మంది
  • బొమ్మల్లా ఎగిరిపోయిన కార్లు, కుప్పకూలిన భవనాలు

దక్షిణ మధ్య, తూర్పు అమెరికాలో టోర్నడో బీభత్సానికి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో గాయపడ్డారు. టోర్నడో కారణంగా బలమైన సుడి గాలులు వీస్తూ, భారీ వర్షాలు కురుస్తూ పట్టణాలు, నగరాలను ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇల్లినాయిస్‌లో మరో నలుగురు మృతి చెందడంతో మృతుల సంఖ్య 21కి పెరిగింది.

టోర్నడో ప్రభావం టెనెస్సీ కౌంటీలో ఎక్కువగా ఉంది. దాదాపు 50 మిలియన్ల మందికిపైగా టోర్నడో ప్రభావానికి గురైనట్టు ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ తెలిపింది. ఈ వారాంతంలో మిడ్‌వెస్ట్, దక్షిణ ప్రాంతాలను తాకిన టోర్నడోల నుంచి కొందరు సురక్షితంగా బయటపడ్డారు. అక్కడ వాహనాలు బొమ్మల్లా ఎగిరిపోగా, భవనాలు కుప్పకూలాయి. చెట్లు కుప్పకూలాయి. దాదాపు 8 రాష్ట్రాల్లో టోర్నడో ప్రభావం కనిపించింది. ఆర్కాన్సాస్ రాజధాని లిటిల్ రాక్‌లో దాదాపు 2,600 నిర్మాణాలకు ముప్పు ఏర్పడినట్టు మేయర్ ఫ్రాంక్ స్కాట్ జూనియర్ తెలిపారు. కాగా, టోర్నడోలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

అమితాబ్ బచ్చన్‌కు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తి!

Drukpadam

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే ….పత్రికా స్వేచ్ఛలో దిగజారుతున్న భారత్ స్థానం…

Drukpadam

దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ఆవిష్కరించనున్న కేసీఆర్..

Drukpadam

Leave a Comment