Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాజకుటుంబంపై ప్రిన్స్​ హ్యారీ సంచలన వ్యాఖ్యలు…

రాజకుటుంబంపై ప్రిన్స్​ హ్యారీ సంచలన వ్యాఖ్యలు…
-నా తండ్రి మమ్ములను పెంచేందుకు ఎన్ని భాదలు పడ్డరోనని ఆవేదన
బాధల బంధనాలను తెంచుకునేందుకే దూరంగా వచ్చేశాం
తన పెంపకంలో తన తండ్రి ఎన్నో బాధలు పడ్డారని కామెంట్
తన పిల్లల విషయంలో అది జరగకూడదనే ఈ నిర్ణయమని వెల్లడి
బ్రిటన్ రాజరికాన్ని వదులుకొని స్వతంత్రంగా జీవించ దలుచుకున్న బ్రిటన్ రాజు కుమారుడు ప్రిన్స్ హ్యారీ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధలు, బంధనాల నుంచి విముక్తి పొందేందుకే కుటుంబం అనే సంకెళ్లు తెంచుకుని అమెరికాకు వెళ్లామని ఆయన చెప్పారు. తన తండ్రి ప్రిన్స్ చార్లెస్ పడిన బాధలే తానూ పడ్డానని చెప్పుకొచ్చారు. గురువారం ‘ఆర్మ్ చెయిర్ ఎక్స్ పర్ట్’ పాడ్ క్యాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితంలోని పలు విషయాలను పంచుకున్నారు.

ఈ విషయంలో తన తండ్రిని నిందించదలచుకోలేదని హ్యారీ చెప్పారు. అయితే, తన పిల్లల విషయంలో మాత్రం తన తండ్రి చేసిన తప్పే చేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని వివరించారు. తన పిల్లల పెంపకం విషయంలో తాను చాలా ఆవేదనకు గురయ్యానన్నారు. రాజకుటుంబంలో ఇలాంటి బాధలే తన తల్లిదండ్రులూ పడి ఉండొచ్చన్నారు. కాబట్టి ఆ బాధల బంధనాలను తెంచుకోవాలన్న నిర్ణయానికి వచ్చానని తెలిపారు.

తమ పెంపకం విషయంలో తన తండ్రి ఎన్ని కష్టాలు పడ్డాడో, రాచబిడ్డల్లా తమను పెంచేందుకు ఎంత ఆవేదన అనుభవించారో ఇప్పుడు అర్థమవుతోందన్నారు. ఇలాంటి పెంపకాన్ని తన పిల్లలకు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే భార్యాపిల్లలతో అమెరికాకు వచ్చేశానని ఆయన వివరించారు. ప్రస్తుతం మేఘన్ తో కలిసి ఆయన లాస్ఏంజిలిస్ కు సమీపంలోని మోంటేసిటోలో నివసిస్తున్నారు.

Related posts

కూతురు పెళ్లికి హాజరై.. తండ్రికి పదవిని బహుమతిగా ఇచ్చిన సీఎం కేసీఆర్!

Drukpadam

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత…అపోలో వైద్యుల ప్రకటన విడుదల!

Drukpadam

టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు… హర్యానాలో దారుణం!

Ram Narayana

Leave a Comment