Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

అతిథులకు రూ.500 నోట్లతో స్వీట్లు వడ్డించిన అంబానీలు.. ట్విస్ట్ ఏంటంటే?

అతిథులకు రూ.500 నోట్లతో స్వీట్లు వడ్డించిన అంబానీలు.. ట్విస్ట్ ఏంటంటే?

  • ముంబైలో గతవారం నీతా ముఖేశ్ అంబానీ కల్బరల్ సెంటర్ ప్రారంభం
  • అట్టహాసంగా జరిగిన వేడుకకు తరలివచ్చిన సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు
  • తమదైన శైలిలో ఆతిథ్యం ఇచ్చిన అంబానీ కుటుంబం

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌ పర్సన్‌ నీతా అంబానీ కలల ప్రాజెక్ట్‌ అయిన నీతా ముఖేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌ గత శుక్రవారం  ఘనంగా ప్రారంభమైంది. ముంబై లోని జియో వరల్డ్‌ సెంటర్‌ లో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభ వేడుకలు మూడు రోజుల పాటు అట్టహాసంగా జరిగాయి. దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు. ప్రారంభోత్సవానికి రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలు తరలివచ్చారు. రజనీకాంత్, షారుఖ్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్‌, దీపికా పదుకొణె-రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకా చోప్రా-నిక్‌ జొనాస్‌, సచిన్ టెండూల్కర్–అంజలి దంపతులతో పాటు ఐశ్వర్యరాయ్‌, ఆలియా భట్‌ సహా బాలీవుడ్ సెలబ్రిటీలంతా కనిపించారు.

వారందరికీ అంబానీ కుటుంబం అసాధారణ ఆతిథ్యం ఇచ్చింది. అతిథులకు వడ్డించిన ఆహారం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరీ ముఖ్యంగా భోజనం తర్వాత అందించిన స్వీట్ ప్లేట్లలో రూ. 500 నోట్లు ఉండటం చర్చనీయాంశమైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ  స్వీట్ పేరు దౌలత్ కి చాట్. నార్త్ ఇండియాలో బాగా ఫేమస్. అయితే, వాటి చుట్టూ పేర్చిన 500 రూపాయల నోట్లు అసలైనవి కావట. బొమ్మ నోట్లు. అలంకరణ కోసమే వాటిని అలా పేర్చి అతిథులుకు స్వీట్లు అందించారు.

Related posts

మోడీ ప్రమాణస్వీకారానికి పలువురు ప్రముఖులు హాజరు…

Ram Narayana

పాలసముద్రంలో ‘నాసిన్’ కేంద్రాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ… హాజరైన సీఎం జగన్

Ram Narayana

 ఇళయరాజా కుటుంబంలో తీవ్ర విషాదం… కుమార్తె భవతారిణి కన్నుమూత

Ram Narayana

Leave a Comment