Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు..!

రాహుల్ గాంధీకి మధ్యంతర బెయిల్ మంజూరు..!

  • మోదీ అనే ఇంటి పేరుపై రాహుల్ వ్యాఖ్యలు 
  • రాహుల్ పై పరువునష్టం కేసు వేసిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ
  • రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష
  • కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలంటూ రాహుల్ పిటిషన్

రాహుల్ గాంధీ రెండేళ్ల శిక్షపై సోమవారం అప్పీల్ కోసం రాహుల్ స్వయంగా సూరత్ వెళ్లడం సంచలనంగా మారింది. ఆయనతోపాటు సోదరి ప్రియాంక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు . రాహుల్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు .మధ్యాహ్నం కోర్టుకు వచ్చిన రాహుల్ గాంధీ నేరుగా సెషన్ కోర్టుకు హాజరైయ్యారు . రాహులు వాదనలు విన్న జడ్జి బెయిల్ ను ఏప్రిల్ 13 వరకు పొడిగించారు . ఆరోజు తిరిగి వాదనలు వింటామని వాయిదా వేశారు . కింది కోర్ట్ తీర్పుపై మే 3 వ తేదీన విచారణ చేపడతామని కోర్ట్ తెలిపింది. దీంతో కోర్ట్ హాల్ నుంచి రాహుల్ సోదరి కాంగ్రెస్ సీఎంలు పార్టీ ముఖ్యనేతలతో కలిసి బయటకు వచ్చి తిరిగి అక్కడ నుంచి బస్సు లో వెళ్లి పోయారు 

మోదీ అనే ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సూరత్ న్యాయస్థానం రెండేళ్ల జైలుశిక్ష విధించడం తెలిసిందే. దొంగలందరికీ మోదీ అనే ఇంటి పేరే ఉంటోంది అని రాహుల్ వ్యాఖ్యలు చేయగా… గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే, న్యాయవాది పూర్ణేశ్ మోదీ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులోనే రాహుల్ కు జైలుశిక్ష పడింది.

అయితే, ఈ పరువునష్టం కేసులో కింది కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం రాహుల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ గడువును ఏప్రిల్ 13 వరకు విధించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 13కి వాయిదా వేసింది. కాగా, నేటి విచారణకు రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి వచ్చారు.

రాహుల్ ది అంత డ్రామా బీజేపీ విమర్శలు ...

రాహుల్ స్వయంగా కోర్ట్ కు రాకుండానే బెయిల్ కు అప్లై చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ డ్రామాలు ఆడుతున్నారని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు విమర్శించారు . కేవలం రాజకీయ మైలేజ్ కోసం సూరత్ వెళ్లాడని దుయ్యబట్టారు .

Related posts

మాజీ ఎంపీ -ఎమ్మెల్యే మద్య మాటల యుద్ధం

Drukpadam

జనాభాలో చైనాను దాటనున్న భారత్…

Drukpadam

బాలుడిపై న్యాయమూర్తి లైంగిక వేధింపులు.. సస్పెండ్ చేసిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment