Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి రాజకీయ అడుగులపై ఆసక్తి ..

పొంగులేటి రాజకీయ అడుగులపై ఆసక్తి …త్వరలో వెండి తెరపై చూపిస్తానంటున్న పొంగులేటి …
-ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు …అభ్యర్థుల ప్రకటనలు
-వేలాదిగా తరలివచ్చిన అభిమానులు
-ఇప్పటికే 8 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు
-ఈనెల 9 కొత్తగూడెంలో సమ్మేళనం
-చివరగా ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనం …
-మాజీ మంత్రి తుమ్మలను దగ్గరకు తీయడం ద్వారా పొంగులేటి ప్రభావాన్ని తగ్గించాలని ఆలోచన

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక శిభిరం ఏర్పాటుతో రాజకీయాలు ఆసక్తిగా మారాయి. ఆత్మీయ సమ్మేళనాలు , నిరంతరం పర్యటనలతో నిత్యం ప్రజల్లో ఉంటూ దూసుకు పోతున్నారు . జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక బలమైననేతగా ఆయన కనపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు గుప్పిస్తున్నారు . కేసీఆర్ ఎన్నికల హామీలు , రైతుల రుణమాఫీ , డ్వాక్రా మహిళకు రుణమాఫీ ,నీళ్లు ,నిధులు , నియామకాలు, దళిత బంధు , నిరుద్యోగ భృతి , పై నిలదీస్తున్నారు . పేపర్ లీకేజ్ కి భాద్యత వహిస్తూ సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలనీ పొంగులేటి డిమాండ్ చేయడం ఆసక్తిగా మారింది. జిల్లాలో దూకుడుగా వ్యవరిస్తూ ప్రజలను నేను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు . జిల్లాలో అనేకమంది ఆత్మీయులను , సహచరులను కలిగి తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు . ఆయన అడుగులు ఎటు వైపు …ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు … అనేది జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే పెద్ద ఆసక్తిగా మారింది. రెండు జాతీయ పార్టీలు పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్వయంగా పొంగులేటి ఫోన్ చేసారని విశ్వసనీయ సమాచారం …బీజేపీ నుంచి పొంగులేటిని తమ పార్టీలో చేర్చుకునేలా మధ్యవర్తిత్వం నడుపుతున్నట్లు తెలుస్తుంది.అయితే పొంగులేటి మాత్రం ఎవరికీ ఇంతవరకు మాట ఇవ్వలేదు . తన రాజకీయ అడుగులు ఎటువైపు అనేది త్వరలో వెండి తెరపై చూపిస్తానని పొంగులేటి అంటున్నారు . కొంతమంది రాజకీయ పండితులను , మేధావులను ఆయన తన రాజకీయ అడుగులపై సంప్రదిస్తున్నారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు పూర్తీ అయిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని నమ్మకమైన సమాచారం . ఈనెల 9 న కొత్తగూడెం లో నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం జరగనున్నది . 25 తేదీ లోపు చివరగా ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్ణయించాలని అప్పటికి ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుయాయులు అంటున్నారు .

2022 డిసెంబర్ చివరినాటికి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ తో ఉన్న పొంగులేటి అందులో తనకు గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీకి దూరమైయ్యారు . 2023 జనవరి 1 న ఖమ్మం లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పార్టీ తనను అవమానించడంపై గళం విప్పారు . నమ్ముకున్న పార్టీ గౌరవించకపోయాన పర్వాలేదు కానీ , అవమానించడం ఏమిటని ప్రశ్నించారు . దీంతో అంతకు ముందు కొద్దో గొప్పో సంభందాలు కలిగి ఉన్న పొంగులేటి పూర్తీ దూరమైయ్యారు . పొంగులేటి ప్రభావాన్ని తగ్గించాలంటే తుమ్మల లాంటి సీనియర్ నాయకులను చేరదీయాలని భావించిన కేసీఆర్ అందుకు అనుగుణంగా ఖమ్మం బీఆర్ యస్ సభ సందర్భంగా పావులు కదిపారు . తుమ్మల కు కూడా ఎలాంటి హామీ ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలకు పిలవడంపై ఆయన అనుయాయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు .

పొంగులేటి రాజకీయ అడుగులు జిల్లా రాజకీయాలను కశ్చితంగా ప్రభావం చూపించనున్నాయనే అభిప్రాయాలే ఉన్నాయి. దీనిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన మాత్రం నవ్వుతు తప్పకుండ ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందని అంటున్నారు . చూద్దాం ఏమి జరుగుతుందో మరి ….!

 

Related posts

మళ్ళీ కేసీఆర్ నోట థర్డ్ ఫ్రంట్ మాట …

Drukpadam

కొడవళ్ళతో దోస్తీ… గులాబీ లో కలవరం ….

Drukpadam

గాయత్రీ రవిని వరించిన అదృష్టం …  టీఆర్ యస్ రాజ్యసభ సీటు ఖరారు !

Drukpadam

Leave a Comment