Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు!

టెన్త్ పేపర్ లీక్ కేసు.. బండి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు!

  • టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో ఈ నెల 19 వరకు రిమాండ్
  • కోర్టులో బెయిల్ పిటిషన్ వేసిన సంజయ్ తరపు లాయర్లు
  • సంజయ్ ను కరీంనగర్ కోర్ట్ కు తరలింపు …

తెలంగాణలో సంచలనం రేకెత్తిస్తున్న టెన్త్ హిందీ క్వశ్చన్ పేపర్ లీకేజ్ కేసులో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మేజిస్ట్రేట్ కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఈ నెల 19 వరకు రిమాండ్ విధించింది. ఈ కేసులో బండి సంజయ్ ను పోలీసులు ఏ1గా పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ఆయన పేపర్ లీకేజ్ కుట్రకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. మరోవైపు, సంజయ్ కు ఈ వ్యవహారంతో సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇరు వైపుల వాదనలు విన్న జడ్జి సంజయ్ కు 14 రోజుల రిమాండ్ విధించారు.

మరోవైపు, ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకవేళ సంజయ్ కు బెయిల్ రాకపోతే… ఆయననుకరీంనగర్ కోర్ట్ కు తరలింపు …  మరోవైపు, బండి సంజయ్ ను విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాలని కోర్టును పోలీసులు కోరబోతున్నట్టు తెలుస్తోంది. రేపు వారు కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.

బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు కరీంనగర్ జైలుకు తరలింపు!

Bandi Sanjay sent to Karimnagar jail in paper leak case

పదో తరగతి పేపర్ లీకేజ్ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ప్రశాంత్, మహేశ్, శివగణేశ్ లకు కు కోర్టు రిమాండ్ విధించింది. మరోవైపు సంజయ్ వేసిన బెయిల్ పిటిషన్ ను రేపు విచారిస్తామని కోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో సంజయ్ తో పాటు ఇతరులను భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు.

మరోవైపు బండి సంజయ్ కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించాలని కోర్టును ఆయన తరపు లాయర్లు కోరారు. దీంతో, ఆయనకు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించి నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ బెయిల్ పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఇదే సమయంలో రేపు పోలీసులు సంజయ్ ను కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేయనున్నారు.

Related posts

సంక్రాంతికి హైద్రాబాద్ ఖాళీ …సొంతూళ్లకు క్యూకట్టిన జనం!

Drukpadam

ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు…

Drukpadam

వైసీపీ ఎంపీపై లోక్ సభ స్పీకర్ ప్రశంసల జల్లు!

Drukpadam

Leave a Comment