Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

టెన్త్ పేపర్ లీకేజ్ కేసు.. ఈటల రాజేందర్ కు నోటీసులిచ్చిన పోలీసులు!

టెన్త్ పేపర్ లీకేజ్ కేసు.. ఈటల రాజేందర్ కు నోటీసులిచ్చిన పోలీసులు!

  • వాట్సాప్ ద్వారా ఈటలకు క్వశ్చన్ పేపర్ చేరినట్టు పోలీసుల నిర్ధారణ
  • ఈటల స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్న పోలీసులు
  • ఈటల నియోజకవర్గంలోని కమాలాపూర్ నుంచి హిందీ పేపర్ లీక్

పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ అంశం తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ను ఈరోజు కోర్టు విచారించనుంది.

మరోవైపు కేసు విచారణలో పోలీసులు దూకుడు పెంచుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు కూడా పోలీసులు నోటీసులిచ్చారు. టెన్త్ హిందీ పేపర్ వాట్సాప్ ద్వారా ఈటలకు కూడా చేరిందని నిన్న వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపిన సంగతి తెలిసిందే. వాట్సాప్ మెసేజ్ ఆధారంగానే ఈటలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేయనున్నారు.

హిందీ క్వశ్చన్ పేపర్ ఈటల రాజేందర్ కు చెందిన హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ నుంచి బయటకు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, ఇందులో ఈటల పాత్ర ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. మరోవైపు బండి సంజయ్ రిమాండ్ ను కొట్టివేయాలంటూ తెలంగాణ హైకోర్టులో బీజేపీ లీగల్ సెల్ లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.

Related posts

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ‘తానా’ బోర్డు డైరెక్టర్ భార్య, ఇద్దరు కుమార్తెల దుర్మరణం!

Drukpadam

ఫోన్ ట్యాపింగ్‌లో కీలకమైన పాత డేటా మాయం…42 హార్డ్‌డిస్క్‌లు మూసీలో కలిపేశారు…

Ram Narayana

సీబీఐ అదుపులో వైసీపీ సోషల్ మీడియా కంటెంట్ రైటర్‌?

Drukpadam

Leave a Comment