వనమానే కొత్తగూడెం వెలుగు …ఆయన ఆత్మీయ సమ్మేళనాలు పెట్టవద్దని ఆదేశాలు అబద్దం ..వనమా వర్గం..
-తప్పుడు మాటలు నమ్మవద్దని వనమా అనుయాయుల విజ్ఞప్తి
-వనమాకు ప్రజలు భ్రమ్మరథం పడుతున్నారని వెల్లడి
-కొత్తగూడెంలో హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ పేరు ప్రస్తావన
-దీనిపై ఆరాతీసుతున్న రాజకీయ వర్గాలు
-సిపిఐకి కొత్తగూడెం కేటాయించకపోతే పొత్తుపై సందిగ్దమే అంటున్న సిపిఐ వర్గాలు
-వేచిచూసే ధోరణిలో జలగం వెంకట్రావు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం పాలేరు తర్వాత కొత్తగూడెం నియోజకవర్గంపై అధికార బీఆర్ యస్ నుంచి పలువురు ఆశలు పెట్టుకున్నారు . అయితే నాలుగుసార్లు గెలిచి ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన వనమానే కొత్తగూడెం వెలుగు అంటున్నారు ఆయన అనుయాయులు …బుధవారం కొత్తగూడెంలో ఒక వార్త చక్కర్లు కొట్టింది…ఎమ్మెల్యే వనమా బీఆర్ యస్ పార్టీ ఆదేశాలమేరకు నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు . ఆయన్ను పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆత్మీయ సమ్మేళనాలు పెట్టవద్దని ఆదేశించిందని దాని సారాంశం.. దీనిపై వనమా వర్గీయులు మండిపడుతున్నారు . పెద్ద వయసులోనూ ప్రజలకోసం విరామమెరగక శ్రమిస్తున్న వనమా ను కాదని మరొకరికి సీటు ఎవరికీ ఇచ్చిన సహకరించే పరిస్థితి కనిపించడంలేదు. అయితే ఆయన పనివిధానంలో సీఎం కేసీఆర్ కు సైతం భిన్నాభిప్రాయం లేకున్నా వయసు పై పడినందున ప్రత్యాన్మయా ఆలోచనలు చేస్తున్నారని అంటున్నారు .అయితే వనమా వెంకటేశ్వరరావు కాకపోతే లెక్కప్రకారం ఆయన కుమారుడు వనమా రాఘవ కొత్తగూడెం నియోజవర్గం నుంచి పోటీ చేయాలనీ పావులు కదిపారు . ఒక కుటుంబం ఆత్మహత్య కేసులో ఆయన ఇరుక్కోవడం ఆయన పాలిట శాపంగా మారింది. దీంతో ఇప్పుడు వనమా కుటుంబం నుంచి సీటు మారడం ఖాయమనే వాదనలే బలంగా ఉన్నాయి.
ఈసీట్లు పై సిపిఐ కన్నేసింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న కూనంనేని సాంబశివరావు ఈ సీటు నుంచి బీఆర్ యస్ మద్దతుతో పోటీచేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది . సిపిఐకి కొత్తగూడెం ఇవ్వకపోతే బీఆర్ యస్ పొత్తు ప్రస్నార్ధకమే అవుతుందని అంటున్నారు సిపిఐ వర్గాలు .
మరో పక్క రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు ఇక్కడ నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గడల యూత్ ,గడల ట్రస్ట్ పేరుతొ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . మాటిమాటికి కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు . వీలున్నప్పుడల్లా గడల శ్రీనివాస్ రావు సీఎం కేసీఆర్ ను ప్రసన్నం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నింస్తున్నారు . ఆయన్ను ఆత్మీయ సమ్మేళనాలు పెట్టాలని పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి.
మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు కూడా కొత్తగూడం సీటును బలంగా ఆశిస్తున్నారు .చాలాకాలంగా పార్టీకి దూరంగా ఉన్న వెంకట్రావును ఖమ్మం లో జరిగిన బీఆర్ యస్ బహిరంగసభ సందర్భంగా స్వయంగా ఆయనకు కబురు పెట్టి పిలిచారు. ఆయన కూడ సీఎం పిలుపు మేరకు ఖమ్మం సభలో కనిపించారు. తర్వాత ఆయన కొత్తగూడెంలో పర్యటనలు జరుపుతూ తన అనుయాయులను కలుస్తున్నారు . తనకు కొత్తగూడెం ఇచ్చే అవకాశం ఉందని ఆయన నమ్ముతున్నారు . ఒకవేళ కొత్తగూడెం ఇవ్వకపోయినా ఆయన సేవలు మరో విధంగా ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారని వినికిడి .
కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు వనమా అభిమానుల విజ్ఞప్తి
నిన్న సాయంత్రం నుండి కొత్తగూడెం నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావును టార్గెట్ గా కుటుంబ సభ్యులపై కొందరు వ్యక్తులు పుకార్లు షికార్లు చేస్తున్నారు.
కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు తెలియజేయునది ఏమనగా కొత్తగూడెం నియోజకవర్గానికి ఎమ్మెల్యే వనమా నే బాస్, ఎమ్మెల్యే వనమాకు , మంత్రి కేటీఆర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని మేము పూర్తిగా ఖండిస్తున్నామని, కొందరి స్వార్థపరుల కోసం కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్త, అభిమానులు తిప్పి కొట్టాలని, ఆ ప్రచారంలో నిజం లేదని కావాలనే కొందరు వ్యక్తులు ఈ విధమైన ప్రచారం చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, ఎమ్మెల్యే వనమా మరియు వనమా కుటుంబ సభ్యులపై ఎంత దుష్ప్రచారం చేసినా కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలు నమ్మరని ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల గుండెల్లో ఎమ్మెల్యే వనమా ఉన్నాడనే విషయం మరవద్దని తెలియజేస్తున్నాం పేర్కొన్నారు .