Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి…!

బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి…!

  • కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో బీజేపీలో చేరిన కిరణ్
  • కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి
  • బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నారన్న జోషి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆఖరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు . రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన కిరణ్ కుమార్ రెడ్డి విభన తర్వాత కొత్త పార్టీ పెట్టి ఘోరంగా ఓడిపోయారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కొంతకాలం క్రితం కెవిపి రామచందర్ రావు తో కలిసి వెళ్లి రాహుల్ గాంధీని కలిశారు . అప్పుడు తిరిగి కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన చురుగ్గా పాల్గొనబోతున్నారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు .తిరిగి కొన్ని రోజులుగా బీజేపీ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఆయన ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి ప్రహ్లదు జోషి సమక్షంలో కాషాయం తీర్ధం పుచ్చుకున్నారు. ఆయనపై బీజేపీ భారీ ఆశలే పెట్టుకున్నట్లు కనిపిస్తుంది. ఆయన ఎంతవరకు వారి ఆశలను నెరవేర్చుతారనేది చూడాల్సి ఉంది . ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పార్టీ సభ్యత్వాన్ని అందించి, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల బీజేపీ కీలక నేతలు డాక్టర్ లక్ష్మణ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా, చీఫ్ విప్ గా, ఎమ్మెల్యేగా కిరణ్ కుమార్ రెడ్డి సేవలందించారని చెప్పారు. కొన్ని దశాబ్దాలుగా కిరణ్ కుటుంబం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని తెలిపారు. కిరణ్ తండ్రి అమర్ నాథ్ రెడ్డి మంత్రిగా పని చేశారని, కిరణ్ సీఎంగా చేశారని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ అని, రంజీ స్థాయి వరకు ఆడారని తెలిపారు. కిరణ్ తన ఇన్నింగ్స్ ను కాంగ్రెస్ లో ప్రారంభించారని, ఇప్పుడు బీజేపీలో కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్నారని చెప్పారు.

ఏపీలోనే కాదు తెలంగాణలోనూ కిరణ్ ప్రభావం ఉంటుంది: ప్రహ్లాద్ జోషి

Union minister Prahlad Joshi said Kiran impact will be in Telangana also

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఇవాళ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో కిరణ్ కుమార్ రెడ్డి కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ, మోదీ నేతృత్వంలో సాగుతున్న పోరాటంలో ఇకపై కిరణ్ కుమార్ రెడ్డి కూడా భాగస్వామ్యం కానున్నారని తెలిపారు. కిరణ్ ప్రభావం ఏపీలోనే కాదు, తెలంగాణలోనూ ఉంటుందని స్పష్టం చేశారు.

గొప్ప రాజకీయ నేపథ్యం ఉన్న కిరణ్ కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ లో కొనసాగిందని, క్రికెట్ నేపథ్యం కూడా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఇక బీజేపీ తరఫున ఆడతారని పేర్కొన్నారు. ఏపీలో కిరణ్ సూపర్ బ్యాటింగ్ చేస్తారని చమత్కరించారు. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో ఏపీ బీజేపీ బలోపేతం అవుతుందని ప్రహ్లాద్ జోషి నమ్మకం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ను వీడుతానని ఎప్పుడూ అనుకోలేదు.. మోదీ గురించి నాకు బాగా తెలుసు: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy speech after joining BJP

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని తను ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యమైపోయిందని చెప్పారు. విభజన విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లేమితో బాధపడుతోందని చెప్పారు. కాంగ్రెస్ కు అధికారం కావాలని, బాధ్యతలు అవసరం లేదని అన్నారు. రాష్ట్ర నాయకుల శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించరని, ఎవరికి ఏ బాధ్యత ఇవ్వాలో కూడా వారికి అవగాహన ఉండదని చెప్పారు. అందుకే ఆ పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోందని అన్నారు.

1980లలో తొలి ఎన్నికల్లో బీజేపీకి రెండు సీట్లు వచ్చాయని, ఒకటి ఏపీలో, మరొకటి గుజరాత్ లో వచ్చాయని కిరణ్ చెప్పారు. ఆ రెండు సీట్ల నుంచి 303 స్థానాలకు బీజేపీ ఎదిగిందని తెలిపారు. ఎంతో కష్టపడి బీజేపీ ఈ స్థాయికి చేరుకుందని చెప్పారు. దేశ అభివృద్ధికి సంబంధించి బీజేపీకి క్లియర్ విజన్ ఉందని కితాబునిచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడు మోదీ కూడా సీఎంగా ఉన్నారని… తాము అప్పుడు కొన్ని సమావేశాల్లో కలుసుకున్నామని, ఆయన గురించి తనకు బాగా తెలుసని, అవినీతికి మోదీ పూర్తిగా వ్యతిరేకమని తెలిపారు. మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి బీజేపీకి ప్రజలు దగ్గరయ్యారని చెప్పారు. బీజేపీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలను అప్పగించినా నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

Related posts

కర్ణాటక ఎన్నికల ఫలితాలు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆధిక్యత—!

Drukpadam

విజయమ్మ కోపంలో చేయి విసిరారు… ఆ దెబ్బకు ఈగైనా చస్తుందా?: షర్మిల

Drukpadam

కేసీఆర్ చెప్పిన మాటలు తెలంగాణ మంత్రులు వినలేదా?: సజ్జల ఫైర్

Drukpadam

Leave a Comment