Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని

ప్రధాని మోడీ పర్యటన నిరసించండి …కూనంనేని
బండి సంజయ్ టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకారి
పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు జుగుస్సాకరం
అవినీతిపరులు బీజేపీ లో చేరితే పునీతులవుతున్నారు

ప్రధాని నరేంద్రమోడీ హైద్రాబాద్ పర్యటనను సిపిఐ నిరసిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు . ఖమ్మం జిల్లా సిపిఐ కార్యాలయం గిరిప్రసాద్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి ప్రవేటీకరణను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని ఇప్పటికే కొన్ని బొగ్గుగనులను ప్రవేటీకరించిన కేంద్రం మరికొన్ని ప్రవేట్ పరం చేసేందుకు సిద్ధమైందని కేంద్ర విధానాలపై ఆయన ధ్వజమెత్తారు . అదానీ విషయంలో జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని ప్రతిపక్షాలు పట్టుబడితే అందుకు సమ్మతించకుండా పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు దేశ చరిత్రలో మాయని మచ్చగా మిగిలాయని ధ్వజమెత్తారు . ప్రతిపక్షాలు జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయాలని నెత్తి నోరు మొత్తుకున్నా లక్ష్య పెట్టకపోవడంపై మండిపడ్డారు . లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న అదానీనిని కాపాడేందుకు చివరకు పార్లమెంటునే బుల్డోజ్ చేసిన మోడీ వైఖరిని సాంబశివరావు తప్పు పట్టారు .
అవినీతి పరులుగా ఉన్నవాళ్లు బీజేపీలో చేరితే పునీతులవుతున్నారని ఆలా అనేకమంది అవినీతి పరులు బీజేపీలో చేరితే అంతకు ముందు ఈడీ , సిబిఐ ,ఐటీ సంస్థలను ఉసి గొల్పి తర్వాత వారి వైపు కన్నెత్తకుండా చేసిన విషయాలను ఆయన ఎత్తు చూపారు . అందువల్ల మోడీ పర్యటనను నిరసించాలని తమ పార్టీ పిలుపు నిచ్చిందని అన్నారు.

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ టెర్రరిస్ట్ కన్నా ప్రమాదకారిగా మారారని 10 క్లాస్ ప్రకాశ పత్రాల లీకేజీ వ్యవహారంలో ఆయన పాత్రపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు . రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించి రాజకీయలబ్ది పొందాలని బీజేపీ చూసిందని అందులో భాగంగానే పరీక్షా పత్రాల లీకు అని అభిప్రాయపడ్డారు . దీనిపై సిట్టింగ్ జడ్జి తో విచారణ చేపట్టాలని సాంబశివరావు డిమాండ్ చేశారు . రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగనివ్వమని వారి అరాచకాలను అడ్డుకుంటామని అన్నారు.

 

Related posts

సిద్ధ‌రామ‌య్య చేయి ప‌ట్టుకుని ప‌రుగెత్తించిన రాహుల్ గాంధీ.. 

Drukpadam

నిన్న, మొన్న వచ్చినవారికి మంత్రి పదవులు…ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

Drukpadam

మళ్లీ ఎన్డీయేనే.. ప్రధాని మోదీకే ప్రజల పట్టం.. ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో వెల్లడి!

Drukpadam

Leave a Comment