Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేసీఆర్ అనే రావణాసురుడిని నుంచి విముక్తి లభించింది … తన సస్పెండ్ పై తీవ్రంగా స్పందినచిన పొంగులేటి…

కేసీఆర్ అనే రావణాసురుడిని నుంచి విముక్తి లభించిందితన సస్పెండ్ పై తీవ్రంగా స్పందినచిన పొంగులేటి
భద్రాద్రి రాముడి చెంతకు పంపుతున్నందుకు కేసీఆర్ ,కేటీఆర్ లకు ధన్యవాదాలు
సస్పెండ్ ఒకేచేసిన తీరు రాజ్యాంగబద్దంగా లేదుహాస్యాస్పదంగా ఉంది
కోర్టులు కూడా శిక్ష వేసేముందు చివర కోరిక అడుగుతాయి
పార్టీలు షోకాజ్ నోటీసులు ఇస్తాయిఅదిజరగలేదు
అంటే కేసీఆర్ రాజ్యాంగం ఇంతే ఉంటుంది.
గులాబీ పార్టీలో చేరినందుకు బాధపడుతున్నానుఅనేకమంది వద్దని చెప్పారువారి మాట వినలేదు క్షమించమని కోరుతున్నాను ..
పార్టీలో చేరతాననేది ఇంకా నిర్ణయించుకోలేదుకేసీఆర్ భాదితులకు అందరం ఐక్యమవుతున్నాం
బీఆర్ యస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ యస్ అభ్యర్థిని కూడా అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం
అసెంబ్లీకే పోటీచేస్తా….

బీఆర్ యస్ నుంచి ఎట్టకేలకు సస్పెండ్ అయిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా స్పందించారు . తన సస్పెన్షన్ పై ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు . అనేక మంది చెప్పిన వినకుండా తాను గులాబీ పార్టీలో చేరి తప్పు చేశానని ఒప్పుకున్నారు . ఇప్పుడు తనకు కేసీఆర్ అనే రావణసురుడి నుంచి విముక్తి లభించిందని తాను భద్రాద్రి రామయ్య కాళ్ళ చెంతకు పోయినంత ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డారు . తాను 100 రోజులుగా పార్టీ పనితీరుపై, కేసీఆర్ ప్రజా వ్యతిరేక చర్యలపై గళం విప్పుతున్నానని అయిన పట్టించుకోని పార్టీ నేతలు జూపల్లి రాగానే సస్పెండ్ చేయటానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు . సస్పండ్ చేసినందుకు అభ్యంతరం లేదుకానీ చేసిన తీరు జుగుస్సాకరంగా ఉందని ధ్వజమెత్తారు . చివరకు కోర్టులు సైతం శిక్ష వేసే మందు నీ కోరిక ఏమిటని అడుగుతాయని ఇది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని ,మరి కేసీఆర్ రాజ్యాంగంలో అసలు నియమ ,నిబంధనలు ఉండవా అని ఎద్దేవా చేశారు . కనీసం షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేయడం దారుణమని వాపోయారు . అంటే కేసీఆర్ సొంత రాజ్యాంగం ఇలాగె ఉంటుందా అని విమర్శలు గుప్పించారు . తాను గులాబీ పార్టీలో చేరి తప్పుచేశానని అందుకు ప్రజలు నన్ను క్షమించాలని వేడుకున్నారు. 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే నాడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసిన తమకు జిల్లాలో ఒక ఎంపీతో పాటు నాలుగైదు అసెంబ్లీ సీట్లు వస్తాయని తెలిసిన టీఆర్ యస్ నేతలు కేటీఆర్ , జగదీష్ రెడ్డి తమ చుట్టూ తిరిగమద్దతు అడిగిన మాట నిజామా..కదా …? అని ప్రశ్నించారు . తమకు తగిన ప్రాధాన్యత ఇస్తామన్న మాట వాస్తవం కదా అని అన్నారు . తాను గెలిచినా తర్వాత పాలేరు ఎన్నికలకు 12 రోజుల ముందు బ్రతిమిలాడి పార్టీలో చేర్చుకొని తిరిగి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పింది అబద్దమా …? అని అన్నారు . 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కేసీఆర్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన నామ నాగేశ్వరావు కు పార్లమెంట్ ఎన్నికలకు ముందు గులాబీ కండువా కప్పి లోకసభ సీటు ఇచ్చింది నిజం కదా అని ప్రశ్నించారు . తనకు రాజ్యసభ ఇస్తామని చెప్పారు . ఇచ్చారా? .. 2018 ఎన్నికల్లో ఓటమికి కారణాలు గురించి నాడైనా పిలిచి మాట్లాడారా ..? ఎదుటి వ్యక్తి అభిప్రాయాలు తీసుకోకుండానే మీకు మీరే ఒక నిర్ణయానికి రావడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు . నేను పార్టీలో చేరిన కొత్తలో జితేందర్ రెడ్డి ,బూర నరసయ్య గౌడ్ బి బి పాటిల్ లాంటి టీఆర్ యస్ ఎంపీలు కొత్తబిచ్చగాడివి నీకు కేసీఆర్ గురించి తెలియదు అరెణ్ణెల్ల తర్వాత నిన్ను వదిలేయడం ఖాయమని హితబోధ చేశారని కానీ నన్ను ఐదు నెలల్లోనే వదిలేసినా విషయాన్నీ ప్రస్తావించారు . ఇది కేసీఆర్ విధానమని ఆలస్యంగా అర్థం అయిందని అన్నారునా అనుకున్న వాళ్లకు ఎలాంటి పదవులు ఇవ్వలేదు సరికదా తనకు తిరిగి ఇస్తాన్న లోకసభ సీటు కానీ రాజ్యసభ సీటు కానీ ఇవ్వలేదని వాపోయారు . నేనేంటి అనేకమంది ఉద్యమంలో కీలంగా ఉండి ఉద్యమానికి దిశా నిర్దేశం చేసిన ప్రొఫెసర్ జయశంకర్ , అలె నరేందర్ , విజయశాంతి , కొండా లక్ష్మణ్ బాపూజీ , ప్రొఫెసర్ కోదండరాం , లాంటి వారినే వాడుకొని వదిలేసినా చరిత్ర కేసీఆర్ దని పొంగులేటి గద్గద స్వరంతో అన్నారు .

ఖమ్మం జిల్లాలో ఒక్క బిఆర్ ఎస్ ఎమ్మేల్యే అసెంబ్లీ గేటు తాకనివ్వను

2014, 18 లో బీఆర్ యస్ కు వచ్చిన ఒక్క సీటు కూడా ఈసారి దక్కనివ్వను వారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను అని సవాల్ విసిరారుతనకు జిల్లాలో తిరగకుండా ప్రజలకు దూరం చేయాలనీ పన్నని కుట్రలేదుచేయని ప్రయత్నం లేదు..అయిన ప్రజల ప్రేమాభిమానాలతో వారితోనే ఉంటున్నాను . నిరంతరం వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నాను ..ఎన్నికల్లో మీరు తిరగాలని కోరితే తిరిగానుచివరకు తాతా స్వగ్రామం పిండిప్రోలు ఎన్నికల్లో ఆయన చెపితే సహాయం చేశానుఅనేక మంది ఎంపీటీసీలు , సర్పంచులను గెలిపించాను . కానీ నాకు వారు ఇచ్చిన గిఫ్ట్ ఏమిటి పార్టీ నుంచి సస్పెన్షన్ఇదేనా కేసీఆర్ గారు మీనీతి సహాయం చేసేవాడిని గౌరవించే పద్దతి అన్నారు .

ఒక్క ఖమ్మం జిల్లానే కాదు, నాలా నష్టపోయిన వందలాది మంది నేతలలో రాజకీయ నిర్ణయం తీసుకుంటామని .ఎవరికీ గౌరవం లేదు.. అనేకమంది పార్టీలో ఇమడలేక పోతున్నారు . కొద్ది రోజులలో అందరూ బయటకు వస్తారు. స్క్రీన్ మీద చూస్తారని అన్నారు .

నన్ను రాజకీయ సమాధి చేయాలని చూసింది నిజం కాదా కేసీఆర్.పార్లమెంట్ ఎన్నికల తరువాత ఇస్తానన్న రాజ్యసభ టిక్కెట్ ఏమైంది.నాకొడుకు రిసెప్షన్ కు వచ్చిన ప్రజలను చూసి కళ్ళు కుట్టాయా.నన్ను నమ్ముకున్న వేలాది మందిని ఇబ్బంది పెట్టి, ఎలాంటి పదవులు ఇవ్వకపోయినా మిమ్మల్ని నమ్మే ఉన్నాను ఇప్పటి వరకు.నేను నమ్మిన సిద్ధాంతం కోసం, నన్ను ఆశీర్వదించే ప్రజలకోసం ఎంతవరకైనా పోరాడుతానని పొంగులేటి స్పష్టం చేశారు . బీఆర్ యస్ ఓటమే లక్ష్యంగా పనిచేస్తానని శపథం చేశారు . ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అసెంబ్లీ గేటు టచ్ చేయలేరని అన్నారు . అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల్లో దేనికి పోటీచేస్తారని విలేకర్లు ప్రశ్నించగా అప్పుడు పరిస్థితులను బట్టి నిర్ణయించుకుంటామని ముందు అసెంబ్లీ ఎన్నిలకు వస్తాయి కాబట్టి అసెంబ్లీకి పోటీచేస్తానని ఎక్కడ నుంచి పోటీచేసేంది నిర్ణయించుకోలేదని అన్నారు .

ఎంపీటీసీ జడ్పిటీసీ ఎన్నికలలో నా వారికి భీ ఫామ్ లు ఇవ్వలేదేందుకు

రాజకీయంగా నన్ను ఇబ్బందులకు గురి చేయవచ్చుకానీ ప్రజలలో ఉన్న నన్ను ఏమి చేయలేరుఖమ్మం మున్సిపాలిటీ లో నావారికి 5, 6 సీట్లు ఇమ్మన్నా ఇవ్వలేదు… 2014 ముందు రాజకీయ చరిత్ర లేదు, అయినా ప్రజల కష్ఠ సుఖాలలో ప్రజలకు తోడుగా ఉన్నా, ఇది కూడా తప్పే అంటారాసింగరేణి ఎన్నికలలో దసరా సందర్భంగా కూడా ఇంటికి వెళ్లకుండా 32రోజులు కొత్తగూడెం లో ఉండి పని చేసినా, మీరిచ్చిన గౌరవం ఏమిటని నిలదీశారు .

తండ్రిలా భావించినా, ప్లీనరీకి 2 కోట్లు రూపాయలు ఇచ్చినా దక్కిన గౌరవం ఏమిటి..నా తండ్రికి తప్ప ఎవరి కాళ్ళు మొక్కలేదుకేసీఆర్ ను తండ్రిగా భావించి కాళ్ళు మొక్కానుఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్ సస్పెన్షన్

 

పొంగులేటి సభ్యత్వమే లేదు అన్నవాళ్ళు .బీఆర్ యస్ లో సస్పెన్షలు ఉండవన్నవాళ్ళు ఇప్పుడు ఏమంటారు …?

పొంగులేటికి పార్టీలో సభ్యత్వం ఉందా…? ఉంటె చిట్టి చూపించమని వ్యంగ్యంగా మాట్లాడిన జిల్లా అధ్యక్షుడు తాతా మధు , అసలు బీఆర్ యస్ సస్పెన్షన్లు ఉండవన్న మంత్రి పువ్వాడ అజయ్ లు ఇప్పుడు తన సస్పెన్షన్ పై ఏమని సమాధానం చెపుతారని అన్నారు . సభ్యత్వం లేనప్పుడు సస్పెన్షన్ ఎందుకు చేశారో తమ నాయకులను తెలుసుకోవాలని అన్నారు.

ప్రజలలోకి వెళ్తాను, ప్రజాలలోనే ఉంటాను

భగవంతుడు తప్పు చేసిన వారి అందరినీ శిక్షిస్తాడని నమ్ముతాను అది మీకు కూడా వర్తిస్తుంది. నీళ్లు నిధులు నియామకాలు లో కల్వకుంట్ల కుటుంబానికి వరదలా వెళ్లాయికేసీఆర్ కుటుంబమే బంగారు కుటుంబం అయ్యింది.. తప్ప తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని పొంగులేటి ధ్వజమెత్తారు . తన చివర రక్తపు బొట్టువరకు ప్రజలకోసం పనిచేస్తానని అన్నారు .మీడియా సమావేశంలో వివిధ నియోజకవర్గాల ఇంచార్జిలు , డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ బాబు , తుళ్లూరు బ్రహ్మయ్య , మద్దినేని బేబీ స్వర్ణ కుమారి , పిడమర్తి రవి , కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య , వైరా మున్సిపల్ చైర్మన్ సుతగాని జైపాల్ , బొర్రా రాజశేఖర్ , కొణిజర్ల ఎంపీపీ గోసు మధు తదితరులు పాల్గొన్నారు .

Related posts

హుజురాబాద్ లో సామ, దాన, భేద, దండోపాయాలు!

Drukpadam

శివసేనను బీజేపీ అంతం చేయాలనుకుంటోంది… ఉద్ధవ్ థాకరే!

Drukpadam

జగన్ బెయిల్ రద్దు కోసం మళ్ళీ రఘురామ పిటిషన్ ….

Drukpadam

Leave a Comment