Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈనెల 14 మంచిర్యాల లో కాంగ్రెస్ దీక్ష …పాల్గొననున్న ఖర్గే …మల్లు నందిని !

ఈనెల 14 మంచిర్యాల లో కాంగ్రెస్ దీక్ష …పాల్గొననున్న ఖర్గే …మల్లు నందిని !
-పాదయాత్ర అనే ఆయుధం ద్వారా బీఆర్ యస్ ప్రభుత్వాన్ని పాతరేస్తాం …
-రాహుల్ పార్లమెంట్ సభ్యత్వం రద్దుపై ఉద్యమం కొనసాగిస్తాం
-బీజేపీ పాలన అంతం కాంగ్రెస్ తోనే సాధ్యం
-ఎమ్మెల్సీ కవితపై భట్టి సతీమణి ఘాటు వ్యాఖ్యలు
-మధిరలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అరాచకాలు …

ఈనెల 14 న భట్టి పాదయాత్రను పురస్కరించుకొని రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఒకరోజు దీక్ష చేపట్టినట్లు తెలిపారు . ఈ దీక్షకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతున్నారని పేర్కొన్నారు . అందువల్ల మధిర నియోజకవర్గం నుంచి అధికసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనాలని ఆమె పిలుపు నిచ్చారు . సోమవారం ఖమ్మం నగరంలోని భట్టి క్యాంపు కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గ ప్రసాద్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ మండు తున్న ఎండలను సైతం లెక్కచేయకుండా భట్టి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు . పాదయాత్ర లో భాగంగా ఈ నెల 14న జరగబోయే మంచిర్యాల బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటానికి భట్టి ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు. మంచిర్యాలలో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా మల్లికార్జున కార్గే పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో పేపర్ లీకేజీల పరంపర కొనసాగుతున్న , పదో తరగతి పరీక్షలు పేపర్ కూడా లీక్ చేయడం దారుణామన్నారు . బీజేపీ, బి ఆర్ ఎస్ ప్రజా వ్యతిరేఖ పాలన అందిస్తున్నాయని మండిపడ్డారు. ఛత్తిస్ గడ్, రాజస్థాన్ లో గ్యాస్ సిలెండర్ ధర రూ.500 కే ఇస్తున్నారని అన్నారు. ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేశారని బీజేపీ పాలన పై ఆమె మండిపడ్డారు.

ఎమ్మెల్సీ కవితపై భట్టి సతీమణి ఘాటు వ్యాఖ్యలు

లిక్కర్ స్కాంలో ఓ మహిళ ఉండటం దారుణమని.. రాష్ట్రంలో లిక్కర్ తాగి అనేక మంది చనిపోతున్నారని… . రాష్ట్రంలో వితంతు పెన్షన్ ఎక్కువగా ఉండటానికి కారణం బిఆర్ఎస్ ప్రభుత్వమే అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని ఆరోపించారు. నిప్పు లేనిదే పొగ రాదని ఎదో జరిగింది కాబట్టే ఎమ్మెల్సీ కవిత విచారణ జరిగిందన్నారు.

మధిర నియోజకవర్గంలో అధికార పార్టీ జడ్పీ చైర్ మెన్ కమల్ రాజు అనుచరులు అరాచకాలు ఎక్కువ అయ్యాయని పార్టీ నేత దుర్గా ప్రసాద్ ఆరోపించారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

సి జె ఐ పర్యటనపై తెలుగు దేశం స్పందన…

Drukpadam

కేంద్ర బడ్జెట్ నిరాశాజనకం,ఏపీకి తీరని అన్యాయం: విజయసాయి …

Drukpadam

రఘురామకృష్ణరాజుపై వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ కు లేఖ రాసిన వైసీపీ

Drukpadam

Leave a Comment