Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా కలెక్టర్ కు వినితి పత్రం…

విశ్రాంతి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ముందు ధర్నా
కలెక్టర్ కు వినితి పత్రం…
-రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తేదీన పెన్షన్ చెల్లించాలి ..
-పెండింగ్ లో ఉన్న మూడు డి ఏ లు విడుదల చేయాలి …
-ఆరోగ్య కార్డులు విడుదల చేయాలి ..
-పన్ను మినహాయింపు అమలు చేయాలి
-రైల్వే ప్రయాణాల్లో రాయితీ ఇవ్వాలి

విశ్రాంతి ఉద్యోగుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆ సంఘం నాయకులు
నిరసన దీక్ష చేపట్టారు . అంతరం గ్రీవెన్స్ లో వినతిపత్రం సమర్పించారు . రిటైర్డ్ ఉద్యోగులకు ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ లు చెల్లించాలని , ఈహెచ్ఎస్ కార్డులను అన్ని ఆసుపత్రిలో అమలు చేయాలని , జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య అధ్యక్షతన జరిగిన ఈ నిరసన దీక్ష కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. పురుషోత్తం , రాష్ట్ర కార్యదర్శి పి.శరత్ బాబు దీక్షను ప్రారంభిస్తూ మాట్లాడారు. పెన్షన్ దార్ల పట్ల అవలంబిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ నిరసన తెలిపారు . విశ్రాంతి ఉద్యోగాలను ఆర్థికంగా వేధిస్తూన ప్రభుత్వాల నిర్లక్ష్యo పూర్తిగా వ్యవహరిస్తున్న ధోరణ సరైనది కాదని , 3 డిఏ లు , పెండింగ్ లో ఉంచిన ఆరోగ్య కార్డులను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరారు . పే రీవిజన్ లో ప్రకటించడం కాకుండా కాలయాపన చేస్తున్న విధానాన్ని తీవ్రంగా నిరసించారు . సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు . ఆదాయపు పన్నును మినహాయింపు చేయాలని కోరారు . ఈ ఎన్నికల సంవత్సరంలో పెన్షన్ దారుల పెండింగ్ డిమాండ్లను పరిష్కరించకపోతే దాన్ని ఫలితాన్ని ప్రభుత్వం అనుభవించక తప్పదని హెచ్చరించారు . రిటైర్డ్ ఉద్యోగులకు రైల్వే ప్రయాణంలో రాయితీని పునర్దించాలన్నారు . ఇ కుబేర్ వేతనాలు , నెలలు తరబడి ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్ లో ఉంచడాని ఖండిస్తూ మెడికల్ రిమెంబర్స్ మెంట్ ద్వారా మంజూరైన ఆర్థిక ప్రయోజనాలను ఎస్ టి ఓ కార్యాలయం నుండి వెంటనే విడుదల చేయాలని సంఘం గౌరవ అధ్యక్షులు ఎర్రని రామారావు , ప్రధాన కార్యదర్శి ఎం సుబ్బయ్య డిమాండ్ చేశారు . ఎస్ టి వో ను ఖమ్మం కలెక్టరేట్ నుండి ఖమ్మం పట్టణంలోకి మార్చాలని కోరారు . తమ సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి , ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని అధికారులకు విన్నవించారు . ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి డి కె శర్మ , జిల్లా నాయకులు చెంబు రెడ్డి , జనార్దన్ రావు , ఉపేందర్ రావు , తాళ్ళురి వేణు , సాంబశివరావు , రఘుపతి రెడ్డి , ఎస్ పూర్ణచంద్రరావు , కే వీరయ్య , బేజి మ్యాన్ మదన్ మరియు ఖమ్మం , వైరా , తల్లాడ , సత్తుపల్లి , కూసుమంచి , మధిర , ఏన్కూర్ మండలం నుండి బాధ్యులు పాల్గొన్నారు .

Related posts

జర్నలిస్టుల కష్టాలు తెలుసు అందుకే ప్రత్యేక యాప్ :సి జె ఐ ఎన్ వి రమణ…

Drukpadam

శ్రీకాకుళం జిల్లాలో నెత్తురోడిన రైలు పట్టాలు… ఐదుగురి మృతి!

Drukpadam

ఆసియాలోని కలుషిత నగరాల జాబితా..టాప్ 8 నగరాలు మనదేశంలోనివే!

Drukpadam

Leave a Comment