Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

బీఆర్ఎస్ కు ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరణ!

  • దేశవ్యాప్తంగా పార్టీల హోదాల్లో మార్పులు చేర్పులు
  • ఏపీలో ఉనికి చాటుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ కు నిరాశ
  • పలు ఇతర పార్టీలకు కూడా ఇదే పరిస్థితి
  • ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ నిర్ణయం

ఏపీలోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో నిరాశ తప్పలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది.

రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే… ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6 శాతం ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3 శాతం సీట్లు కానీ సాధించాల్సి ఉంటుంది. అటు, 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులకు కనీసం 8 శాతం ఓట్లయినా వచ్చి ఉండాలి.

ఈ లెక్కన చూస్తే… ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా ఇస్తున్నట్టు ఈసీ నేటి ప్రకటనలో వెల్లడించింది.

ఇక, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ), పశ్చిమ బెంగాల్ లో ఆర్ ఎస్పీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది. అటు, మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోతా పార్టీ, నాగాలాండ్ లో జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీగా గుర్తింపునిస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డర్-1968 పేరా 6 ప్రకారం ఈసీ ఈ మేరకు నిర్ణయించింది.

Related posts

బెంగళూరులో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసులో టీఎస్ ప్రజా ప్రతినిధులు!

Drukpadam

విశాఖ దేశంలోనే ప్రాధాన్యత కల్గిన నగరాల్లో ఒకటి …ప్రధాని మోడీ !

Drukpadam

ఉపన్యాసంలో స్టయిల్ మార్చిన పవన్ !

Drukpadam

Leave a Comment