ఖమ్మం రాజకీయాల్లోనూ సంచలనాలు నమోదుకాబోతున్నాయ్….!
- మా అజెండా బీఆర్ఎస్ అభ్యర్థులని ఓడించడమే
- పదికి పది సీట్లు పొంగులేటి టీమే గెలుస్తుంది
- స్కూటర్ మీద తిరిగి ఈ స్థాయికి ఎదిగిన తీరును శీనన్నే వందసార్లు చెప్పారు
- జర్నలిస్ట్ సోదరులకు సాయం చేయడానికి పొంగులేటి సిద్ధమే… మీ వంతుగా ఎన్ని ఎకరాలు ఇస్తారు..?
- ఎంపీ నామాను ఇంటిపేరుతో దూషించి మళ్లీ మీ పార్టీలోకి చేర్చుకున్న విషయం మర్చిపోయారా…
- తమ్ముడ్ని సర్పంచ్ గా గెలిపించుకోలేని లింగాల కమల్ రాజు నీకు మాట్లాడే అర్హత లేదు
- రాబోయే ఎన్నికల్లో తేల్చుకుందాం అప్పటి వరకు ఆగండి
- ఆగలేకపోతే ఏదైనా ఓ ఛానల్ లో పోల్ పెట్టండి
- ఒక్క శాతం పోల్ శీనన్నకు తక్కువ వచ్చినా పోటీ నుంచి తప్పుకుంటాం….
- విలేకరుల సమావేశంలో పొంగులేటి వర్గీయులు మువ్వా విజయబాబు, మద్దినేని బేబీ స్వర్ణకుమారి, డాక్టర్ కోటా రాంబాబు, మలీదు జగన్
ఐపీఎల్ మ్యాచ్లో రింకూ సింగ్ చివరి ఓవర్లో ఐదు బంతులకు వరుసగా ఐదు సిక్స్లను కొట్టి జట్టును గెలిపించడమే కాకుండా… రికార్డు సృష్టించాడు… అలాంటి రికార్డే ఖమ్మం రాజకీయాల్లోనూ రాబోవు ఎన్నికల్లో నమోదు కాబోతుంది…. పదికి పది సీట్లను పొంగులేటి టీమ్ గెలిచి ప్రభంజనం సృష్టించబోతుందని పొంగులేటి వర్గీయులు మువ్వా విజయబాబు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, డాక్టర్ కోటా రాంబాబు, మలీదు జగన్ పేర్కొన్నారు. పొంగులేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ…. మా జెండా అజెండా బీఆర్ఎస్ అభ్యర్థులని ఓడించి మా నాయకుడు అన్నట్లు ఒక్కరంటే ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటును తాకనివ్వకపోవడమేనన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆయన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు శీనన్న స్కూటర్ మీద తిరిగే వారని అంటున్నారని… ఆ విషయం శీనన్నే కొన్ని వందలసార్లు చెప్పారన్నారు. ఆయన స్కూటర్ మీద తిరిగే స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలా ఎదిగారో ఉమ్మడి ప్రజలందరకీ తెలుసని అన్నారు. జర్నలిస్ట్ సోదరులకు సాయం చేయడానికి శీనన్న సిద్ధంగానే ఉన్నారని… మీ వంతుగా ఎన్ని ఎకరాలు ఇస్తారని ప్రశ్నించారు…. మీ వంతు సాయం ప్రకటించండి…తక్షణమే శీనన్న స్పందిస్తాడని తెలిపారు. నాడు సీఎం కేసీఆర్ని పొగిడి ఇప్పుడు తిడుతున్నారని పొంగులేటిని. విమర్శిస్తున్నారని 2018 లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ఎంపీ నామాను సీఎం కేసీఆర్ ఇంటిపేరుతో దూషించి కొన్ని నెలలకే వచ్చిన ఎంపీ ఎన్నికల్లో పార్టీలో చేర్చుకుని సీటు ఇచ్చిన విషయం మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ ఊసేలేదని ఆరోపించారు. పేదల ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ చేసే క్రమంలో ఎస్ఆర్ఎస్ పేరుతో దోపిడి చేసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే జీతాలు, లోన్ల విషయాల్లో విఫలమైందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ ని శీనన్నకు తగ్గించారని, జరగరానిది ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వమే దానికి బాధ్యత వహించాలన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే వెన్ను పోటు పొడిచే నాయకులు ఉన్నారని అది మీరే గ్రహించుకోవాలని సూచించారు. ఎంపీగా పొంగులేటి ఉన్నప్పుడు 100శాతం నిధులు ఖర్చు పెట్టి ప్రశంస పత్రం అందుకున్న మాట వాస్తవం కాదా అని గుర్తుచేశారు. జూపల్లి కృష్ణారావు ఆత్మీయ సమ్మేళనానికి రావడంతో పార్టీ వ్యతిరేకులు ఇంకెంతమందిని ఐక్యం చేస్తారో అనే భయంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశారని విమర్శించారు. తమ్ముడ్ని సర్పంచ్ గెలిపించుకోలేని లింగాల కమల్ రాజు నీకు అస్సలు మాట్లాడే అర్హతే లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో తేల్చుకుందాం అప్పటి వరకు ఆగండన్నారు. ఆగలేకపోతే ఏదైనా ఓ ఛానల్లో పోల్ పెట్టండి అని ఆ ఓటింగ్ లో ఒక్క శాతం పోల్ శీనన్నకు తక్కువ వచ్చినా రాబోయే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో ఎంపీపీ గోసు మధు, కార్పొరేటర్ దొడ్డా నగేష్, మందడపు తిరుమలరావు, దుంపల రవికుమార్, మియాభాయ్, కొప్పెర ఉపేందర్, ధరావత్ రామ్మూర్తి నాయక్ తదితరులు ఉన్నారు.