బాధిత కుటుంబాలకు రూ. 50లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి…
– సంఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలి
– చీమల పాడు ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ పొంగులేటి
కారేపల్లి మండలం చీమలపాడు లో జరిగిన బాణాసంచా పేలుడు ఘటన పట్ల ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు . ఈ సంఘటనలో అమాయకులైన ప్రజల ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు . ఒక్కో బాధిత కుటుంబానికి రూ.50లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంఘటనకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలన్నారు. అన్ని రకాలుగా బాధిత కుటుంబాలను ఆదుకోవా లన్నారు. బాణాసంచా వల్లనే ఇది జరిగిందని అంటున్నారని ఇలాంటి సందర్భాల్లో పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటె బాగుండేదని అన్నారు . సిలిండర్ పేలడంతో జరిగిన సంఘటన కాళ్ళు ,చేతులు పోగొట్టుకొన్న వారి ఆర్తనాదాలు చేసుస్తుంటే హృదవిదారకంగా ఉన్నాయని అంటూ ,మృతులకు సంతాపం ప్రకటిస్తూ , వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు .