Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల ఇళ్లస్థలాలు …హెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలి …టీయూడబ్ల్యూ జె ( ఐజేయూ ) డిమాండ్ …

జర్నలిస్టుల ఇళ్లస్థలాలుహెల్త్ కార్డుల సమస్యలను పరిష్కరించాలిటీయూడబ్ల్యూ జె ( ఐజేయూ ) డిమాండ్
మే 15 నాటికీ అన్ని జిల్లాల సభలు పూర్తీ చేయాలనీ తీర్మానం
మే చివరి వారంలో మరోసారి రాష్ట్ర సమావేశం
భావస్వేచ్ఛ పత్రిక ప్రతినెలా తెచ్చేలా రూపకల్పన
కేటీఆర్ కు టీయూడబ్ల్యూ జే (ఐజేయూ ) రాష్ట్ర కార్యవర సమావేశం కృతజ్ఞతలు

జర్నలిస్టుల ఇళ్లస్థలాలుహెల్త్ కార్డుల సమస్యల పరిష్కరించాలని టీయూడబ్ల్యూ జే ( ఐజేయూ ) రాష్ట్ర కమిటీ సమావేశం రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేసేంది మేరకు సంబంధిత అధికారులకు , మంత్రులకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని సమావేశం తీర్మానం చేసింది. మంగళవారం బషీర్బాగ్ లోని దేశోద్ధారక్ భవనంలోని సురవరం ప్రతాప్ రెడ్డి ఆడిటోరియం లో రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సంఘ నిర్మాణం , జిల్లా సభలు , రాష్ట్ర సభలపై సమావేశం విస్తృతంగా చర్చింది. దేశంలో జర్నలిస్టుల పై జరుగుతున్న దాడుల గురించి సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల చండీఘడ్ లో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సమావేశాల్లో సేవ్ జర్నలిజం పేరుతో ఐజేయూ ఇచ్చిన పిలుపుకు దేశవ్యాపితంగా వచ్చిన స్పందనను ఐజేయూ అధ్యక్షులు కె .శ్రీనివాస్ రెడ్డి వివరించారు . పోరాటాల ద్వారానే సమస్యలు పరిస్కారమవుతాయని అందుకు తెలంగాణ సంఘం చేస్తున్న కృషిని ఆయన అభినందించారు . ఇళ్లస్థలాలు , హెల్త్ కార్డులపై ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల అమలునుగుర్తు చేయాలని నిర్ణయించారు . ఐజేయూ మాజీ అధ్యక్షులు ఏపీ ప్రభుత్వ సీఎం జాతీయ అంతర్జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ మాట్లాడుతూ సంఘం పటిష్ఠతకు తీసుకోవాలాల్సిన కృషిని ,జిల్లా కమిటీల నిర్మాణాలను గురించి తెలిపారు . జర్నలిస్టుల శిక్షణ తరగతులు నిర్వహించేందుకు మెఫీ ఆధ్వరంలో తాము సిద్ధంగా ఉన్నామని జిల్లా అయిన 40 మందితో శిక్షణకు ముందుకు వస్తే తాము హైద్రాబాద్ నుంచి శిక్షకులను పంపిస్తామని అన్నారు. అంతకుముందు రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ రాష్ట్రంలో జరిగిన కార్యకలాపాల నివేదికను సమావేశం ముందు ఉంచారు . వివిధ జిల్లాల ప్రతినిధులు తమ జిల్లాల్లో జరుగుతున్న కార్యకలాపాల నివేదికలు ఇచ్చారు .

జిల్లాల్లో మిగిలిన జిల్లాల సభలను మే 15 నాటికీ పూర్తీ చేయాలనీ సమావేశం నిర్ణయించింది. అందుకు వివిధ జిల్లాలకు తేదీలను సైతం ఖరారు చేసింది . దీన్ని సీరియస్ గా తీసుకోని పూర్తీ చేయాలనీ ఆయా జిల్లాల భాద్యులని సమావేశం ఆదేశించింది . మే చిరవరినాటికి మరోసారి రాష్ట్ర కార్యవర్గాల సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆసమావేశంలో రాష్ట్ర సభలు ఎక్కడ జరిపేది , తేదీలు నిర్ణయించాలని సమావేశం తీర్మానించింది . అదే విధంగా రాష్ట్ర యూనియన్ అత్యంత ప్రతిష్ట్మాకంగా భావిస్తున్న భావస్వేచ్చాను ప్రతినెలా తీసుకోచ్చేందుకు ప్రణాళిక రూపకల్పన చేసింది. సమావేశంలో ఐజేయూ కార్యదర్శి నరేందర్ రెడ్డి , స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎం మజీద్ , ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె .సత్యనారాయణ ,రాష్ట్ర ఉపాధ్యక్షులు , కె .రాంనారాయణ , కె .కరుణాకర్ , కార్యదర్శులు మధు , కోశాధికారి మహిపాల్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , ఆహ్వానితులు , వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు .

కేటీఆర్ టీయూడబ్ల్యూ జే (ఐజేయూ ) రాష్ట్ర కార్యవర సమావేశం కృతజ్ఞతలు

రాష్ట్ర ఐటీ ,పరిశ్రమలు మున్సిపల్ వ్యవహారాల మంత్రి కేటీఆర్ యూనియన్ కార్యాలయం దేశోద్ధారక భవనం రెన్యువేషన్ కు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశం తీర్మానం ఆమోదించింది.

Related posts

కత్తి మహేశ్ మృతదేహాన్ని స్వస్థలానికి తరలించిన కుటుంబ సభ్యులు

Drukpadam

సముద్రంలో మునిగిన పడవ, 37 మంది వలసదారుల గల్లంతు…

Drukpadam

నాకు మెడికల్ కాలేజీనే లేదు… దందా ఎలా చేస్తాను?: రేవంత్ పై పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్…

Drukpadam

Leave a Comment