చీమలపాడు ఘటనలో మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఆదుకోవాలి: సీపీఐ(ఎం) * క్షతగాత్రులను పరామర్శించిన పార్టీ ప్రతినిధులు * మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలి * తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు ఇవ్వాలి.. *
అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి: జిల్లా కార్యదర్శి నున్నా
కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో బాణాసంచా పేలి గుడిసె దగ్ధమై గ్యాస్ సిలిండర్ పేరడంతో ఇద్దరు మృతిచెందగా మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన విషయం తెలిసిన వెంటనే సిపిఐ (ఎం) నాయకులు ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరామర్శించేందుకు బుధవారం హుటాహుటిన తరలివచ్చారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు క్షతగాత్రులను పరామర్శించారు. స్పృహలో ఉన్నవారికి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని అవసరమైతే హైదరాబాద్ తరలించాలని కోరారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలను ఓదార్చారు. * మృతుల కుటుంబాలను ప్రభుత్వమే అదుకోవాలి: నున్నా మృతుల కుటుంబాలను బీఆర్ఎస్ పార్టీ లేదా ప్రభుత్వపరంగా ఆదుకోవాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. కోటి ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కాళ్లు తెగిన వారికి రూ.50 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 20 లక్షలు చొప్పున పరిహారం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన వారంతా ‘రెక్కాడితే కానీ డొక్కాడని’ నిరుపేదలు అయినందున వారి కుటుంబాలకి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్య వీరభద్రం, వై విక్రం, జిల్లా కమిటీ సభ్యులు ఎస్. నవీన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
చీమలపాడు సంఘటనలో మృతులకు కోటి రూపాయలు, క్షతగాత్రులకు 50 లక్షల నష్టపరిహారాన్ని అందించాలి సిపిఐ (ఎంఎల్) ప్రజా పంధా డిమాండ్
టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన ప్రమాదంలో గ్యాస్ బండ పేలిన దుర్ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒక్కరికిప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని క్షత్తగాత్రులకు 50 లక్షలు ఆర్థిక సహకరణ అందించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద ఖమ్మం జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చీమలపాడు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రభుత్వ హాస్పటల్ కు తరలించిన నేపథ్యంలో ప్రజాపంద ప్రతినిధి బృందం మృతులను క్ష్తగాత్రులను పరిశీలించి వారి కుటుంబ సభ్యులను మాట్లాడి ఓదార్చడం జరిగింది. సంఘటన పూర్వపరాలను కుటుంబ సభ్యులుతో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. అనంతరం గోకినపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాజకీయ కార్యకలాపాల సందర్భంగా అంగు ఆర్భాటాలు ప్రదర్శించి తగిన జాగ్రత్తలు పాటించని కారణంగా ఈ దుర్ఘటన జరిగిందని ఆయన అన్నారు. ఆ సంఘటనపై ప్రభుత్వం విచారణ జరిపించి నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులకు మెరుగైన వైద్యానికి అందించాలని డిమాండ్ చేశారు .చీమలపాడు సంఘటనలో నష్టపోయిన వారికి ప్రభుత్వంతో పాటు టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా నష్టపరిహారం చెల్లించాలని ఆయన సూచించారు. ప్రతినిధి బృందంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల వెంకటేశ్వర్లు అశోక్ నగర కార్యదర్శి ఝాన్సీ pyl జిల్లా కార్యదర్శి రాకేష్ తదితరులు పాల్గొన్నారు