Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వం తరుపున మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు… మంత్రి పువ్వాడ …

ప్రభుత్వం తరుపున మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు… మంత్రి పువ్వాడ …
-మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటాం
-పార్టీ తరపున మృతులకు రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం
-నామ ముత్తయ్య ట్రస్ట్ తరపున మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి -రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం : నామ ప్రకటన
3 రోజులు సంతాప దినాలు
-సీఎం కేసీఆర్ ఆదేశాలతో అప్రమత్తం – మెరుగైన చికిత్స
-మృతుల కుటుంబాలకు పార్టీ భరోసా
-పార్టీ కుటుంబ సభ్యులను పొగొట్టుకోవడం బాధించింది
-విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ -నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే లావు డ్యా రాములు నాయక్ వెల్లడి…

చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారికి ప్రభుత్వం తరుపున ఎక్స్గ్రేషియ.. మంత్రి పువ్వాడ.
మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి హమీ.

ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం చీమలపాడు అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియ ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

చీమలపాడు ఘటన పట్ల ఎంపీ నామ నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.బుధవారం సాయంత్రం ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో నామ మాట్లాడారు.ఈ ఘటన తనను
ఎంతో బాధించిందని విచారం వ్యక్తం చేశారు.ఇంతకాలం మాతో తిరిగిన పార్టీ కుటుంబ సభ్యులు మాకు ఆకస్మికంగా దూరం కావడం తీవ్రంగా బాధించిందన్నారు.పార్టీ కార్యకర్తలు మృతి చెందడం పట్ల తీవ్రంగా చింతిస్తున్నామని పేర్కొన్నారు.మా కళ్ళ ముందే ఈ ఘటన జరిగిందని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు కార్యకర్తలకు పార్టీ తరఫున రూ.5లక్షలు ,గాయపడిన వారికి రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు .అలాగే నామ ముత్తయ్య ట్రస్ట్ నుంచి మృతుల కుటుంబాలకు
రూ.2 లక్షలు , గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించ నున్నట్లు నామ వెల్ల డించారు .ఘటనలో ఇద్దరు చనిపోగా ,నలుగురు గాయపడ్డారని ,మరొకరు పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిపారు .ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి లోనూ,ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే అత్యవసరంగా హైదరాబాద్ తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విషయమై డాక్టర్లతో నిత్యం సమాలోచనలు జరుపు తున్నట్లు తెలిపారు .
ఘటన పట్ల చింతిస్తూ
సంతాపసూచకంగా మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు నామ తెలిపారు .ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ సూచనల మేరకు కార్యకర్తలకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉండడడం తోపాటు వారి కుటుంబాలను జాగ్రత్తగా చూసుకుంటుందని నామ నాగేశ్వరరావు తెలిపారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ
ఘటన పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇన్ని రోజులు ఆత్మీయ సమ్మేళనాల్లో ఉత్సాహంగా, చురుగ్గా పాల్గొన్న కార్యకర్తలు కళ్ళముందు చనిపోవడం తమను ఎంతగానో బాధించిందన్నారు.
ప్రభుత్వ పరంగా మృతుల కుటుంబాలను అన్నివిధాల ఆదుకుంటామని ,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. ఈ సంఘటనను జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపారు .జిల్లాలో మూడు రోజుల పాటు సంతాప దినాలు పాటించనున్నట్లు వెల్లడించారు.
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో ఈ ఘటన జరగడం చాలా బాధించిందన్నారు. ఇన్ని రోజులు కళ్ళ ముందు తిరిగిన కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకోవడం
బాధించిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండదండగా ఉంటుందని తెలిపారు . క్షతగాత్రులకు మెరుగైన, నాణ్యమైన చికిత్స అందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటే శ్వరరావు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , కారేపల్లి మండల సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ,కారేపల్లి సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, కారేపల్లి దేవస్థానం చైర్మన్ అడ్డగోడ ఐలయ్య తదితరులు పాల్గొన్నారు .

ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయి లో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.

Related posts

రావత్ మృత‌దేహానికి ప్ర‌ముఖుల నివాళులు.. కాసేప‌ట్లో సైనిక లాంఛనాల నడుమ తుది వీడ్కోలు!

Drukpadam

మహానాడుకు నన్ను పిలవలేదు.. టీడీపీ ఇన్చార్జీలు గొట్టంగాళ్లు: కేశినేని నాని

Drukpadam

టీటీడీ ఈవో ధర్మారెడ్డికి జైలు శిక్ష విధించిన హైకోర్టు!

Drukpadam

Leave a Comment