ఏపీలో ఇక బీసీ కుల గణన…!
- రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
- మంత్రి చెల్లుబోయిన నేతృత్వంలో కమిటీ
- ఇప్పటికే ఒడిశా, బీహార్, పంజాబ్ రాష్ట్రాల్లో బీసీ కుల గణన
- అధ్యయనం చేయనున్న చెల్లుబోయిన కమిటీ
రాష్ట్రంలో బీసీ కుల గణన చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ నేతృత్వంలో త్వరలో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. బీహార్, పంజాబ్, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే బీసీ గణన చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న బీసీ జనాభా లెక్కింపును మంత్రి చెల్లుబోయిన ఆధ్వర్యంలోని కమిటీ అధ్యయనం చేయనుంది.
ఈ కమిటీ ఇచ్చే నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి, రాష్ట్రంలో బీసీ కుల గణనకు మార్గదర్శకాలు రూపొందించనుంది. భారతదేశ జనాభాలో ఓబీసీల జనాభా 52 శాతం కంటే అధికంగా ఉంది. అయితే కచ్చితమైన లెక్కలు తేలితే, జనాభా ప్రాతిపదికన బీసీ కులాల వారికి రిజర్వేషన్ ఫలాలు, నిధుల పరంగా మరింత మేలు జరుగుతుందని భావిస్తున్నారు.