Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నుంచి వెనక్కు తగ్గిన కేంద్రం క్రెడిట్ ఎవరి ఖాతాలోకి….

కేసీఆర్ వల్లే స్టీల్ ప్లాంట్ పై కేంద్రం ఆలోచనలో పడింది: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ…

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై వెనక్కి తగ్గిన కేంద్రం
  • ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేస్తామన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్
  • కేసీఆర్ కు ధన్యవాదాలు అంటూ వీవీ లక్ష్మీనారాయణ స్పందన
  • తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్ష
  • విశాఖ ఉక్కు ప్రవేటీకరణ నుంచి కేంద్రం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది.ఇందుకు కారణం బిడ్డింగ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనేందుకు సిద్దపడటమే కారణమనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ లో ఉన్న వైకాపా ప్రభుత్వం కానీ ,విపక్ష టీడీపీ గానీ నోరు పెదపలేదని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు . నిజంగా ఇది కేసీఆర్ ఘనతే అని మాజీ జెడి లక్ష్మీనారాయణ అన్నారు . విశాఖ ఉక్కు విషయంలో ఆయన కోర్టుకు సైతం వెళ్లారు . అందువల్ల దాని క్రెడిట్ కేసీఆర్ కు వెళుతుందని అంటున్నారు . అయితే ఏపీ మంత్రులు మాత్రం తాము విశాఖ ఉక్కు ప్రవేట్ పరం చేయడాన్ని ను వ్యతిరేకించామని పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చామని , సీఎం జగన్ ప్రధాని మోడీకి దీని ప్రాధాన్యత గురించి వివరించారని అంటున్నారు .అందువల్ల పరిశ్రమ ప్రవేట్ పరం కాకుండా చేసిన ఘనత ఎవరిదనే చర్చ జరుగుతుంది….
  • CBI former JD Lakshminrayana thanked CM KCR in Steel Plant issue

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రస్తుతానికి ముందుకెళ్లడంలేదని, అంతకంటే ముందు ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ ప్రకటించడం తెలిసిందే. పూర్తిస్థాయి సామర్థ్యంలో స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలు సాగిస్తుందని, స్టీల్ ప్లాంట్ అభివృద్ధిపై ఆర్ఎన్ఐఎల్ యాజమాన్యంతోనూ, కార్మిక సంఘాలతోనూ చర్చిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. అయితే, స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో  తెలంగాణ ప్రభుత్వం పాల్గొనడం ఒక ఎత్తుగడ అని ఆరోపించారు.

ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. ఒక బృందాన్ని పంపడం ద్వారా వైజాట్ స్టీల్ ప్లాంట్ ఈవోఐ (బిడ్డింగ్)లో పాల్గొనేందుకు చర్యలు తీసుకున్నందుకు కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు.

కేసీఆర్ వల్లే కేంద్రం ఆలోచనలో పడిందని, తెలంగాణ బృందం రావడం వల్లే ప్రస్తుతానికి ప్రైవేటీకరణకు వెళ్లకూడదని, ఆర్ఎన్ఐఎల్ ను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి కారణమైందని లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ లో పాల్గొనాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందన్న హరీశ్ రావు
  • Harish Rao talks about Vizag Steel Plant

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఇప్పటికి లేనట్టేనని కేంద్రం ప్రకటనతో వెల్లడైంది. దీనిపై బీఆర్ఎస్ మంత్రులు వరుసగా స్పందిస్తున్నారు. కేసీఆర్ పోరాటం వల్లే కేంద్రం నిర్ణయం మార్చుకుందని వారు అంటున్నారు. తాజాగా, ఇదే అంశంపై మంత్రి హరీశ్ రావు కూడా మాట్లాడారు.

కేసీఆర్ దెబ్బకు కేంద్రం దిగొచ్చిందని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును అమ్మబోవడంలేదని, బలోపేతం చేస్తామని కేంద్రం ప్రకటించిందని హరీశ్ రావు వెల్లడించారు. ఇది కేసీఆర్ సాధించిన విజయం… ఇది బీఆర్ఎస్ విజయం… ఇది ఏపీ ప్రజల విజయం… ఇది విశాఖ కార్మికుల విజయం అని ఉద్ఘాటించారు.

విశాఖ ఉక్కు గురించి కేసీఆర్, కేటీఆర్, తాను మాట్లాడామని వివరించారు. ఏపీ ప్రజలు, కార్మికుల పక్షాన బీఆర్ఎస్ పోరాడిందని వెల్లడించారు. కానీ, విశాఖ ఉక్కుపై ఏపీ అధికారపక్షం, ప్రతిపక్షం నోరు విప్పలేదని హరీశ్ విమర్శలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కేంద్రంపై పోరు కొనసాగిస్తామని అన్నారు.

Related posts

జగన్ ఒంటిమిట్టకు వెళ్లకుండా కుంటిసాకు…అచ్చెన్నాయుడు విమర్శ …

Drukpadam

నేను సర్వేల ఆధారంగానే మాట్లాడాను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి!

Drukpadam

లోకల్ వార్ లో కుదేలైన టీడీపీ …ఫ్యాన్ స్పీడ్ కు తిరుగులేదని నిరూపించిన ప్రజలు

Drukpadam

Leave a Comment