Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనిపించాయి: శాస్త్రవేత్తలు

  • నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువుల్లో కూడా
  • ఫిబ్రవరి నుంచి జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందన్న శాస్త్రవేత్తలు
  • అయితే జన్యు పదార్థం విస్తరించడం లేదని వెల్లడి

హైదరాబాద్ నగరవాసులకు శాస్త్రవేత్తలు ఆందోళన కలిగించే వార్తను చెప్పారు. భాగ్యనగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ లో కరోనా వైరస్ జన్యు పదార్థాలు కనపడ్డాయని తెలిపారు. సాగర్ తో పాటు ఇతర చెరువుల్లో కూడా ఈ పదార్థాలు కనిపించాయని చెప్పారు. అయితే, కరోనా వైరస్ నీటి ద్వారా వ్యాపించదనే విషయం ఒక అధ్యయనంలో వెల్లడైందని తెలిపారు.

హుస్సేన్ సాగర్ తో పాటు నాచారం పెద్ద చెరువు, నిజాం చెరువులో కూడా కరోనా జన్యు పదార్థాలు కనిపించాయని చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చెరువుల్లో ఈ జన్యు పదార్థాలు పెరగడం ప్రారంభమైందని తెలిపారు. ఈ అధ్యయనాన్ని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ,సీసీఎంబీ సంయుక్తంగా నిర్వహించాయి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయాల్లో ఈ అధ్యయనం చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే చెరువుల్లోని వైరస్ జన్యు పదార్థం మరింతగా విస్తరించలేదని చెప్పారు. భవిష్యత్తులో వస్తుందని భావిస్తున్న మూడో వేవ్ ను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుందని తెలిపారు.

Related posts

వరంగల్ ఎంజీఎంలో ఎలుకల దాడిలో గాయపడిన రోగి శ్రీనివాస్ మృతి!

Drukpadam

పార్లమెంట్ కొత్త భవనం.. ఎన్నో ప్రత్యేకతల నిలయం

Drukpadam

ఆయుష్మాన్ భారత్ లో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు…

Drukpadam

Leave a Comment