Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

అసలు సుఖేష్ ఎవరు …కేసీఆర్ పై కక్షతోనే ఈనాటకమంతా …ఎమ్మెల్సీ కవిత !

సుఖేశ్ తో నాకు పరిచయం లేదు: ఎమ్మెల్సీ కవిత వివరణ…!

  • కేసీఆర్ ను ఎదుర్కోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న కవిత
  • కొందరు పాత్రికేయులు విలువలు పాటించడం లేదని మండిపాటు
  • ఎవరీకీ తలవంచే పరిస్థితే లేదని వ్యాఖ్య

 

లిక్కర్ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. సుఖేష్ అనే వ్యక్తి తెలంగాణ భవనానికి వచ్చి అక్క చెప్పినట్లుగా 15 కేజీల ఘీ అంటే 15 కోట్లు 6060 అనే ల్యాండ్ రోవర్ కారులో పెట్టానని తర్వాత అవి అందినట్లు అక్క మెసేజ్ చేశారని తన తండ్రి ఆరోగ్యం గురించి కూడా అడిగారని అప్పుడు జరిగినట్లుగా చెపుతున్న చాటింగ్ విడుదల చేయాడంపై కవిత స్పందించారు . ఇది అంతా బోగస్ ఫేక్ …కావాలని జరుపుతున్న నాటకం కేసీఆర్ పై కక్ష తోనే తనపై ఇలాంటి ఫేక్ ఆధారాలతో కేసులు పెడుతున్నారని ఆమె అన్నారు . తెలంగాణ బిడ్డలు ఇలాంటి వాటికీ భయపడని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు …

తెలంగాణ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, ముఖ్యంగా తనమీద కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు మద్దతు లభిస్తోందని, బీఆర్ఎస్ కు ఆదరణ పెరుగుతోందని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ము లేక తెలంగాణ వ్యతిరేకులు మీడియా ఛానళ్లు, పేపర్లు, యూట్యూబ్ మీడియాల ద్వారా బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఆర్థిక నేరగాడైన సుఖేశ్ చంద్రశేఖర్ తనను ఉద్దేశిస్తూ లేఖ విడుదల చేయడం, వెంటనే బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం, ఆ తర్వాత బీజేపీ ఎంపీ అర్వింద్ బీజేపీ టూల్ కిట్ లో బురద చల్లే కార్యక్రమాన్ని చేపట్టడం ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయని విమర్శించారు. సుఖేశ్ తో తనకు పరిచయం కూడా లేదని చెప్పారు. ఆయనతో తనకు సంబంధం లేదని తెలిపారు. పాత్రికేయులు కనీస విలువలను కూడా పాటించకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ బిడ్డలం తల వంచమని, తెగించి కొట్లాడతామని చెప్పారు.

Related posts

విభజనవల్ల ఏపీ నష్టం పోయింది. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే …జోనల్ కౌన్సిల్ లో సీఎం జగన్

Drukpadam

మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దు!… టీ కాంగ్రెస్ నేత‌ల‌కు మాణిక్కం ఠాగూర్ వార్నింగ్‌!

Drukpadam

డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు..

Drukpadam

Leave a Comment