క్రైమ్ వార్తలు

కరెంట్ షాక్ తో ముగ్గురు అన్నదమ్ముల మృతి…!

కరెంట్ షాక్ తో ముగ్గురు అన్నదమ్ముల మృతి…!

  • ఇంట్లోని నీటి సంపును కడుగుతుండగా ఒకరికి కరెంట్ షాక్
  • అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరికి విద్యుదాఘాతం
  • ముగ్గురూ అక్కడికక్కడే మ‌ృతి 

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ పారామౌంట్‌ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లోని నీటి సంపును కడుగుతుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. ఒకరిని కాపాడబోయి మరో ఇద్దరు ప్రాణాలను పోగొట్టుకున్నారు.

రజాక్‌ (18) అనే యువకుడు తమ ఇంట్లో ఉన్న నీటి సంపును శుభ్రం చేసేందుకు అందులోకి దిగాడు. ఈ సమయంలో అతనికి కరెంట్‌ షాక్‌ తగిలింది. రజాక్‌ను కాపాడేందుకని అతని సోదరులు అన్నస్‌ (19), రిజ్వాన్‌ (16) కూడా సంపులోకి దిగారు. దీంతో వారికి కూడా షాక్‌ తగలింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మరణించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమితం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడం స్థానికంగా తీరని విషాదాన్ని నింపింది.

Related posts

మెక్సికోలో దారుణం… కాల్ సెంటర్లో ఉద్యోగం మానేస్తున్నారని 8 మంది దారుణ హత్య!

Drukpadam

 15 ఏళ్ల బాలుడితో ప్రేమ.. కలిసి జీవించేందుకు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన యువతి!

Ram Narayana

బార్ బిల్లు గొడవ.. సీనియర్ల వేధింపులకు జూనియర్​ విద్యార్థి ఆత్మహత్య!

Ram Narayana