Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ రాజ్యాంగం పుస్తకాన్ని పంపిన షర్మిల!

సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ రాజ్యాంగం పుస్తకాన్ని పంపిన షర్మిల!

  • నేడు అంబేద్కర్ జయంతి
  • నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల
  • అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదన్న షర్మిల
  • సిగ్గులేకుండా అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారని విమర్శలు

ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హైదరాబాదులో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ కు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుస్తకాన్ని పంపించారు. అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదని విమర్శించారు.

“80 వేల పుస్తకాలు చదివిన అపర మేధావి కేసీఆర్ గారూ… మేం పంపిన రాజ్యాంగం పుస్తకాన్ని తీరిగ్గా చదివి, బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని కోరుతున్నా. నియంత పాలన మానుకుని, ప్రజలకు సమాన హక్కులు కల్పించాలని, ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కులు కల్పించాలని మనవి చేస్తున్నాం” అని షర్మిల పేర్కొన్నారు.

గతంలో రాజ్యాంగం మార్చేయాలని కేసీఆర్ ఎందుకు అన్నారో చెప్పాలని షర్మిల నిలదీశారు. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం నడుస్తోందని, అంబేద్కర్ వారసుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ నేతలు చెప్పుకుంటున్నారని, అంతకంటే పెద్ద జోక్ ఇంకేముంటుందని షర్మిల వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఒక ఆఫ్ఘనిస్థాన్ అయితే, సీఎం కేసీఆర్ ఒక తాలిబన్ అని మండిపడ్డారు. రాష్ట్రంలో దళితుల భూములు లాగేసుకుంటూ, దళితులను జైళ్లలో చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వారసులమని చెప్పుకుంటున్నారు… ముఖ్యమంత్రికి సిగ్గులేకపోతే సరి అని వ్యాఖ్యానించారు.

Related posts

భవానీపూర్ ఉపఎన్నిక: మమతా బెనర్జీపై పోటీ చేయనున్న ప్రియాంక టిబ్రేవాల్?,

Drukpadam

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా…..జోగు రామన్న

Drukpadam

చంద్రబాబు కారును ఢీకొట్టిన మరో కారు.. తప్పిన ప్రమాదం!

Drukpadam

Leave a Comment