Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

సంచలనంగా మారిన లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ పాత్ర…!

సంచలనంగా మారిన లిక్కర్ స్కాం లో కేజ్రీవాల్ పాత్ర…!
ఇందులో కుట్రకోణం ఉందన్న కేజ్రీవాల్
విపక్షాలను టార్గెట్ గానే కేంద్ర దర్యాప్తు సంస్థలు పనిచేస్తున్నాయన్న ఆప్ నేత
సోమవారం సిబిఐ ఎదుట హాజరు కానున్న కేజ్రీవాల్

ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు చాలా మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు ఇదే కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను సీబీఐ సమాన్లు పంపింది. విచారణకు రావాలని పేర్కొంది. మద్యం పాలసీ కేసులో సీబీఐ సమన్లు ​జారీ చేసిన నేపథ్యంలో కేజ్రీవాల్ స్పందించారు. కోర్టులకు అబద్ధాలు చెబుతున్నారని, అరెస్టు చేసిన వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని, ఎలాంటి తప్పు చేసినట్లు రుజువు కూడా లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో మాటల దాడికి దిగిన కేజ్రీవాల్.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి సంస్థలను తమ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునేందుకు వినియోగిస్తున్నారని ఆరోపించారు. 14 ఫోన్‌లను ధ్వంసం చేశారని, అఫిడవిట్‌లలో కోర్టులకు అబద్ధాలు చెప్పారని అన్నారు. అనుమానితులను చిత్రహింసలకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ను కూడా మూడుసార్లు విచారించారు . దేశవ్యాపితంగా బీజేపీ చర్యలను విపక్ష పార్టీలు నిరసిస్తున్నాయి. రాజకీయ క్షక్షతో ప్రత్యర్థులను అణగదొక్కాలని కేంద్రాల్లోని బీజేపీ సర్కార్ పై మండి పడుతున్నారు . గత రెండు మూడు రోజుల క్రితం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితో చాటింగ్ చేసినట్లు ముఖేష్ విడుదల చేసిన దాన్ని ఫేక్ చాటింగ్ అంటూ కవిత కొట్టి పారేశారు . అసలు ముఖేష్ ఎవరో తనకు తెలియదని అన్నారు . దీంతో లిక్కర్ స్కాం అనేక మలుపులు తిరుగుతుంది. ఇది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది . దొంగలు ఎవరు ? దొరలు ఎవరు …? అనేదానిపై ఉత్కంఠత నెలకొన్నది . ప్రధానంగా 15 కోట్ల రూపాయలను ఘీ పేరుతో అందించినట్లుగా చెపుతున్న సుఖేష్ చాటింగ్ బాగా వైరల్ అయింది . అదికూడా తెలంగాణ భవనంలో ఉన్న 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో పెట్టినట్లు చెప్పటం తో ఆ కారు ఎవరిదీ అనే దిశగా ఈడీ కూపీ లాగుతున్నట్లు సమాచారం ..

Related posts

సోనియా గాంధీ తెలంగాణ పర్యటన రద్దు…

Ram Narayana

ఆత్మహత్యాయత్నం చేసిన తమిళనాడు ఎంపీ మృతి

Ram Narayana

కర్ణాటక అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం.. చూడటానికి బాగుందన్న సీఎం!

Drukpadam

Leave a Comment