Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి దూకుడు …ఆయన కదలికలపై రాజకీయ పక్షాల ఆరా …!

పొంగులేటి దూకుడు …ఆయన కదలికలపై రాజకీయ పక్షాల ఆరా …!
-జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠతను రేపుతున్న పొంగులేటి వ్యాఖ్యలు
-ఉమ్మడి జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామని పొంగులేటి ధీమా
– మా గూటి పక్షులకు స్వాగతం పలుకుతున్నానంటూ కీలక వ్యాఖ్యలు
– ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్న పొంగులేటి

బీఆర్ యస్ నుంచి అధికారికంగా సస్పెండ్ అయిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దూకుడు పెంచారు …జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామంటూ ఒక్క బీఆర్ యస్ ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని ఛాలంజ్ విసురుతున్నారు .. ఆయన కదలికలపై రాజకీయ పార్టీలు ఆరా తీస్తున్నాయి . ఏ పార్టీలోకి వెళ్ళతారోననే దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆయన అనుయాయుల బుర్రలు వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీలలో రచ్చబండలపై జరుగుతున్న చర్చలు వాదోపవాదాలకు సైతం దారి తీస్తున్నాయి. బీజేపీ లో చేరితే ఎలా ఉంటుంది. కాంగ్రెస్ లో ఎలా ఉంటుంది … కొత్తపార్టీ పెడతారా , కూటమి కడతారా ..? అనే దానిపై కూడా తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

గత మూడు నెలలుగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తనదైన శైలిలో ప్రజలను ఆకట్టు కుంటూ ముందుకు సాగుతున్నారు . బీఆర్ యస్ తనకు చేసిన అవమానాలపై అన్యాయం పై రగిలి పోతున్నారు . అందుకు ప్రతీకారం తీసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . అయితే ఆయనది కొందరు తొందరపాటు చర్య అన్నా, డబ్బురాజకీయాలు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నా వాటిని పట్టించుకోవడంలేదు . ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే ప్రజల దీవెనలతో అనుకున్నది సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు .

పొద్దుగూకే టైమొచ్చింది…. మా గూటి పక్షులకు స్వాగతం పలుకుతున్నా…. నేడో రేపో వారందరూ మా గూటికి చేరడం ఖాయమని పొంగులేటి శ్రీనివాస రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో ఉత్కంఠతను రేపుతున్నాయి . మధిర నియోజకవర్గంలోని చింతకాని, ముదిగొండ మండలాల్లో ఏర్పాటు చేసిన పొంగులేటి శీనన్న క్యాంపు కార్యాలయాలను ఆయన శనివారం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రజలందరి దీవెనలతో … ఆశీస్సులతో ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పదికి పది సీట్లు గెలుస్తామని…. రామరాజ్యాన్ని తీసుకు వచ్చి సుపరిపాలనను అందిస్తానని… ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని పేర్కొన్నడం గమనార్హం . ఆయన ఏ పార్టీలోకి వెళ్ళేది ఇంకా వెల్లడి కాలేదు … అయినప్పటికీ ఆయన ఏ ధైర్యంతో ఇలా మాట్లాడుతున్నారనేది రాజకీయ పరిశీలకులకు కూడా అంతుపట్టడంలేదు .. రాజకీయాల్లో విశ్వాసం ఉండటం అవసరం …కానీ పొంగులేటి ధైర్యానికి కారణం ఏమిటి అనేది అంతు చిక్కడంలేదు . ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయనమాత్రం ఇంతవరకు తాను ఎలాంటి అభిప్రాయాలకు రాలేదని అంటున్నారు . కానీ అనేకమందితో చర్చలు జరుపుతున్నారు . ప్రజలు మెచ్చే నిర్ణయం తీసుకుంటానని అంటున్నారు . కొత్తగూడెం ఆత్మీయసమ్మేళనంకు మాజీమంత్రి జూపెల్లి కృష్ణారావు హాజరు అయిన మరుసటి రోజునే ఇద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ యస్ కార్యాలయం ప్రకటించిన విషయం విదితమే .

అన్ని పథకాల లాగానే దళితబంధు పేరుతో దళిత సోదరులను మభ్య పెట్టారని విమర్శించారు. పార్టీలకతీతంగా కార్యక్రమానికి హాజరైన వారందరికీ ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. నాలుగు సంవత్సరాలుగా అధికార పార్టీ నేతలు ఎంత హీనంగా చూశారు… శీనన్న ఏ విధంగా మిమ్మల్ని అక్కున చేర్చుకున్నాడనే విషయం ప్రజలందరికీ తెలుసుననన్నారు. శీనన్న మాటల మనిషి కాదనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయని సీఎం కేసీఆర్ ని గద్దె దించాల్సిందేనని పిలుపు నిచ్చారు . అయితే ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయంపై జిల్లాలో బీఆర్ యస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని రాజకీయపరిశీలకుల అభిప్రాయపడుతున్నారు …

Related posts

అవినీతి చీడపురుగు అంటూ బాలినేని పై నారా లోకేష్ ఫైర్ …

Drukpadam

చంద్రబాబు మాటలు అర్థరహితం : సజ్జల ….

Drukpadam

కేసీఆర్ ను ఉద్దేశించి ఈటల లేఖ … ఇది తప్పుడు ప్రచారం అంటున్న ఈటల మద్దతు దార్లు…

Drukpadam

Leave a Comment