Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సీనియర్ పువ్వాడ ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..

సీనియర్ పువ్వాడ ను పరామర్శించిన మంత్రి హరీష్ రావు..

గత రెండు వారాలుగా అస్వస్థతకు గురై హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఐ జాతీయ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తండ్రి పువ్వాడ నాగేశ్వర రావుని శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పరామర్శించారు.

ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు అరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను మంత్రి హరీష్ కు వైద్యులు వివరించారు. రాజకీయ దురంధరుడు పువ్వాడ నాగేశ్వరావు త్వరగా కోలుకుని మంచి ఆరోగ్యంతో తిరిగి మా మధ్యకు రావాలని ఆకాంక్షిచారు.

రెండువారాల క్రితం ఖమ్మంలోని ఆయన స్వగ్రహంలో అస్వస్థతకు గురై మమతా హాస్పిటల్ లో చికిత్స చేర్చారు . మంత్రి అజయ్ అప్పుడు హైద్రాబాద్ లో ఉన్నారు . ఆయన ఖమ్మం రాగానే తండ్రి దగ్గరకు వెళ్లి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకొని హుటాహుటిన హైద్రాబాద్ లోని కిమ్స్ కు తరలించారు .నాటి నుంచి అక్కడే వైద్య సౌకర్యాలు పొందుతున్న పువ్వాడ నాగేశ్వరావు ను మంత్రి కేటీఆర్ , సత్యవతి రాథోడ్ ,జిల్లాకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పరామర్శించారు . సిపిఐ నాయకులూ ఆయన సహచరులు పలువురు సీనియర్ నేతలు ఆయన్ను పరామర్శించారు . మంత్రి పువ్వాడ అజయ్ వారం రోజులు తండ్రి దగ్గరే ఉంది నిరంతరం చూసుకున్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు కూడా కొద్దీ రోజులు అక్కడే ఉంది డాక్టర్లను నిరంతరం అప్రమత్తం చేశారు .

Related posts

నేను ప్రజలు వదిలిన బాణాన్ని …షర్మిల

Drukpadam

తిరుపతి,సాగర్ ఉపఎన్నికలు ఏప్రిల్ 17

Drukpadam

అరెస్ట్ చేయకుండా ఆపండి!… సుప్రీంకోర్టులో నుపుర్ శ‌ర్మ పిటిష‌న్‌!

Drukpadam

Leave a Comment