Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సూర్యుడి ఉపరితలంపై 62 వేల మైళ్ల ఎత్తు ‘ప్లాస్మా గోడ’…!

సూర్యుడి ఉపరితలంపై 62 వేల మైళ్ల ఎత్తు ‘ప్లాస్మా గోడ’…!

  • అద్భుత దృశ్యాన్ని రికార్డు చేసిన అర్జెంటీనా పరిశోధకుడు
  • ప్రత్యేక కెమెరా వ్యవస్థతో ఫొటో తీసిన వైనం
  • సూర్యుడి ఉపరితలంపై ఉప్పొంగిన ప్లాస్మా

అర్జెంటీనా ఖగోళ పరిశోధకుడు ఎడ్వర్డో షాబెర్గర్ పోపీ సూర్యుడికి సంబంధించి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించారు. సూర్యుడి ఉపరితలంపై 62 వేల మైళ్ల ఎత్తు ఉన్న ఓ గోడ వంటి ఆకృతిని గుర్తించారు. ఆ గోడ వంటి రూపం సూర్యుడి ఉపరితలం నుంచి ఉప్పొంగిన ప్లాస్మా కారణంగా ఏర్పడి ఉంటుందని భావిస్తున్నారు.

భూమి వంటి గ్రహాలను ఎనిమిదింటిని ఒకదానిపై ఒకటి నిలబెడితే ఎంత ఎత్తు ఉంటుందో ఈ ప్లాస్మా గోడ అంత ఎత్తు ఉన్నట్టు గుర్తించారు. దీన్ని రికార్డు చేసేందుకు పాపీ ప్రత్యేకమైన కెమెరా వ్యవస్థను ఉపయోగించారు.

కాగా, సూర్యుడిపై ఇలా ప్లాస్మా ఉవ్వెత్తున ఎగసిపడడం సాధారణమేనని, గతంలోనూ వీటిని గుర్తించారని, వీటిని పోలార్ క్రౌన్ ప్రామినెన్స్ (పీసీపీ) అంటారని లైవ్ సైన్స్ జర్నల్ లో ప్రచురితమైన ఓ నివేదికలో పేర్కొన్నారు. పీసీపీలు సూర్యుడిపై ఉపరితలంపై అయస్కాంత క్షేత్రాల నుంచి పెల్లుబికిన ప్లాస్మా లేక అయోనైజ్డ్ గ్యాస్ తో ఏర్పడతాయని వివరించారు.

Related posts

ఎంపీగా మారిన ప‌రుగుల రాణి!.. సంతోషంగా ఉందంటూ మోదీ ట్వీట్‌!

Drukpadam

చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్… ఒక మావోయిస్టు మృతి

Drukpadam

తూర్పు గోదావరి జిల్లాలో కింగ్ కోబ్రా కలకలం… ఎంత పెద్దదో!

Drukpadam

Leave a Comment