Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ వైపు పొంగులేటి మొగ్గు …ఖమ్మం అసెంబ్లీ సీటు పై కన్ను …!

కాంగ్రెస్ వైపు పొంగులేటి మొగ్గు …ఖమ్మం అసెంబ్లీ సీటు పై కన్ను …!
-ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే తన నిర్ణయం ఉంటుందని పలుమార్లు వెల్లడి …
-తన అనుయాయులు ,అభిమానులు కాంగ్రెస్ లో చేరాలని కోరుకుంటున్న వైనం
-కొత్తగూడెం వాళ్ళు రమ్మంటున్న …ఖమ్మం సంగతి తేల్చాలని పట్టుదల
-పొంగులేటి అయితే ఖమ్మం హాట్ సీట్ గా మారె అవకాశం

రాజకీయ క్రాస్ రోడ్ లో ఉన్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు అని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకమే కాకుండా యావత్ రాష్ట్ర ఎదురు చూస్తుంది. కొంతకాలం బీఆర్ యస్ లో అసమ్మతినేతగా ఉన్న పొంగులేటి గత 100 రోజులుగా తిరుగుబాటు బావుటా ఎగర వేశారు . ఇటీవలనే ఆయన్ను బీఆర్ యస్ పార్టీ సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. తన సస్పెన్షన్ ను ఏమాత్రం లెక్కచేయని పొంగులేటి పైగా సస్పెన్షన్ చేసిన తీరును తప్పుపడుతూనే స్వాగతించారు . రావణాసురుడు చెంతనుంచి విముక్తి చెంది భద్రాచలం రాములవారు పాద పద్మాల చెంతకు చేరినంత ఆనందగాఉందని అన్నారు . ఇప్పుడు తన దారి రహదారి అని ప్రజల ఆలోచనలకు అనుగుణంగానే తన రాజకీయ నిర్ణయం ఉంటుందని ప్రకటించిన పొంగులేటి ఆదిశగా అడుగులు వేస్తున్నట్లు విస్వసనీయసమాచారం ..

జిల్లాలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు ,జిల్లా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన నిర్ణయం ఉంటుందని ప్రకటించారు . అందుకు అనుగుణంగా ఆయన కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తుంది. అంతే కాకుండా ఆయన పోటీచేయబోయే నియోజకవర్గం ఏది అనే చర్చ కూడా జరుగుతుది. ఆయన మనుసులోమాట ఇంకా బయట పెట్టనప్పటికీ ఖమ్మం సీటు పై కన్ను వేశారని అంటున్నారు . కొత్తగూడెం లో తన అభిమానులు పోటీచేయమని పట్టు బడుతున్నా తాను ఖమ్మం సంగతి తేల్చుకోవాలనే పట్టుదలతో ఉన్నట్లు అనుయాయులు చెబుతున్నారు . దీంతో ఖమ్మం హాట్ సీట్ గా మారె అవకాశం ఉంది. ఇప్పటికే ఈసీటు మంత్రి పువ్వాడ అజయ్ తిరిగి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. పువ్వాడ వర్సెస్ పొంగులేటి మధ్య పోటీ అయితే ఎలా ఉంటుందో చూడాలని ప్రజలు సైతం కోరుకుంటున్నారు. ఎక్కడ విన్నా ఇదే చర్చ జరుగుతుంది.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని ఇల్లందు , పినపాక , భద్రాచలం , మధిర , వైరా , అశ్వారావుపేట నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన పొంగులేటి మండలాలవారీగా క్యాంపు కార్యాలయాలను కూడా ప్రారంభిస్తున్నారు . సామాజికవర్గాల పొందికలో భాగంగా ఒక బీసీ , ఒక రెడ్డి , ఒక కమ్మ సామాజికవర్గానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న మూడు జనరల్ సీట్లలో అకామిడేట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు . అయితే ఏదైనా పార్టీలో చేరితే ఇది సాధ్యం అవుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. జిల్లాలో ఒక్క బీఆర్ యస్ ఎమ్మెల్యేను కూడా గెలవనివ్వనని, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనని ఛాలంజ్ చేస్తున్న పొంగులేటి ధీమా ఏమిటి అనేది ,ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి కోరిక నెరవేరుతుందా …? అనుకున్నంతపని చేయగలరా …? ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు ఏమిటి ..? ప్రజల మనసులను ఎలా గెలుచుకుంటారో చూడాలి మరి …!

Related posts

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక… అవకాశం ఎవరికీ ?

Drukpadam

గోవాకు శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు…

Drukpadam

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పదవుల్లో చోటు లేకపోవడానికి రేవంత్ రెడ్డితో విభేదాలే కారణమా …?

Drukpadam

Leave a Comment