Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

మండిపోతున్న ఎండలు.. లాగించేస్తున్న బీర్లు.. 17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన హైదరాబాదీలు!

మండిపోతున్న ఎండలు.. లాగించేస్తున్న బీర్లు.. 17 రోజుల్లో కోటి బీర్లు తాగేసిన హైదరాబాదీలు!

  • అసాధారణంగా పెరుగుతున్న ఎండలు
  • బీర్లవైపు చూస్తున్న మందుబాబులు
  • రోజుకు సగటున 6 లక్షల బీర్ల అమ్మకం
  • రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో బీర్ల విక్రయాలు

ఏప్రిల్ నెల వచ్చింది మొదలు ఉష్ణోగ్రతలు పెరిగాయి. అసాధారణంగా పెరుగుతున్న ఎండలు హైదరాబాద్ వాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో మందుబాబుల చూపు బీర్లపై పడింది. ఫలితంగా ఈ నెలలో బీర్ల అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఈ నెల 1 నుంచి 17 వరకు నగరంలో ఏకంగా 1.01 కోట్ల బీర్లు అమ్ముడైనట్టు ఆబ్కారీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రోజుకు సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నట్టు ఆబ్కారీ శాఖ పేర్కొంది.

ఆ శాఖ చెబుతున్న దాని ప్రకారం.. ఈ మూడు జిల్లాల్లో కలిపి ఈ నెల 17 వరకు మొత్తం 8,46,175 కేసుల బీర్లు అమ్మడుపోయాయి. ఒక్కో కేసులో 12 బీర్లు ఉంటాయి. ఈ లెక్కన చూసుకుంటే మొత్తం 1,01,54,100 బీర్లు అమ్ముడుపోయాయి. అలాగే, ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాలలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. రంగారెడ్డి జిల్లాలో బీర్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. నెలకు సగటున లక్ష బీరు కేసులు అదనంగా అమ్ముడవుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి.

 

Related posts

గడువు కంటే ఒక రోజు ముందుగానే పదవీ విరమణ చేసిన సీజేఐ జస్టిస్ లలిత్…. !

Drukpadam

బెంగాల్ లో రెండో రోజూ అల్లర్లు…

Drukpadam

రేపే వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడుగా ప్రమాణ స్వీకారం

Drukpadam

Leave a Comment