Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎం రేసులో ఉన్నాను … అవకాశం ఇస్తే హోదాగా కాకుండా భాద్యతగా భావిస్తా …సీఎల్పీ నేత భట్టి!

సీఎం రేసులో ఉన్నాను … అవకాశం ఇస్తే హోదాగా కాకుండా భాద్యతగా భావిస్తా …సీఎల్పీ నేత భట్టి!
-ఎన్నికల తర్వాతే సీఎం అభ్యర్థిపై నిర్ణయం …నేనే కాదు చాలామంది సీఎం రేసులో ఉన్నారు …
-ఇందిరమ్మ రాజ్యం తెస్తాం …
-కాంగ్రెస్ లో అనేక మంది ముఖ్య నేతలు చేరబోతున్నారు…
-కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం …
-తెలంగాణాలో బీజేపీ ప్రభావం లేదు…
-ఖమ్మంజిల్లాలో ముఖ్యనేతలు చేరుతున్నారు
-ఎవరనేది చెపితే వాళ్లపై వత్తిడి వస్తుంది …
-సీఎం పీఠంపై ఎవరిని కూర్చోబెట్టాలనేది అధిష్టానం నిర్ణయిస్తుంది.

సీఎం రేసులో ఉన్నాను ఎందుకు ఉండకూడదు … అయితే చాలామంది పార్టీలో సీఎంగా చేయగలిగిన సమర్థులు , శక్తి ఉన్నవాళ్లు ఉన్నారన్నారని అన్నారు భట్టి . పీపుల్స్ మార్చ్ లో భాగంగా ఆయన బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటన జరుపుతున్న సందర్భంగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూ లో తన మనసులో మాటలను కుండబద్దలు కొట్టారు . దీనిపై కాంగ్రెస్ లో ప్రకంపనలు మొదలయ్యాయి. మీరు సీఎం రేసులో ఉన్నారా ..? అని అడిగితె తప్పకుండ అన్నారు . తనకు అవకాశం ఇస్తే దాన్నిసంతోషంగా స్వీకరిస్తానని నిష్కర్షగా చెప్పారు . అయితే పదవిని హోదాగా కాకుండా భాద్యతగా భావిస్తా … మా పార్టీలో ఎన్నికల తర్వాతే సీఎం పై నిర్ణయిం జరుగుతుంది . అధిష్టానం అవకాశం ఇస్తే 100 శాతం న్యాయం చేస్తా .. హోదాగా కాకుండా , భాద్యతగా మెసులుకుంటానని తెలిపారు … కష్టాలు ,భాదలు తెల్సినవాణ్ణి…ఆకలి ,అసమానతలు , అవమానాలు తెలిసిన వ్యక్తిని , సమసమాజ స్థాపన ఇందిరమ్మ పై ప్రేమ కల్గినవాణ్ణి , ఆమె రాజ్యం తేవాలని పట్టుదలతో ఉన్నాను . అందువల్ల ఈ విషయం వచ్చినప్పుడు తప్పకుండ పార్టీ చర్చింస్తుందని భట్టి పేర్కొన్నారు.

కాంగ్రెస్ లో అనేకమంది ముఖ్యనేతలు చేరబోతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కమరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు . మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్ లో అనేక మంది ముఖ్యనేతలు చేరబోతున్నారు . ఖమ్మం జిల్లా నుచి కూడా ముఖ్యనేతలు ఉన్నారా …?అంటే తప్పకుండ ఉన్నారని అన్నారు . చాలామంది పెద్ద నాయకులే కాంగ్రెసులోకి రాబోతున్నట్లు చెప్పారు . ఒక్క ఖమ్మమే కాదు రాష్ట్రంలో అనేక జిల్లాల నుంచి కాంగ్రెస్ లో చేరే ముఖ్యనేతలు ఉన్నారని వారి గురించి ఇప్పుడు చెప్పడం మంచిది కాదని అన్నారు …

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది ఇది నేను చెపుతున్నమాట కాదు రాష్ట్రంలో ప్రజలు అనుకుంటున్న మాటలు …నా పాదయాత్రలో సైతం ప్రజల నుంచి ఊహించినదానికంటే ఎక్కువగా వస్తుండంటంతో తమకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు భట్టి …రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ యస్ ప్రజల ఆశలకు అనుగుణంగా పరిపాలన చేయలేదని , అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుంది అన్నారు . కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారో అర్థం కావడంలేదని స్థానిక ప్రజలే చెపుతున్నారని అన్నారు .

బీజేపీకి తెలంగాణ లో పెద్దగా ఆదరణ లేదని అందువల్ల అధికారం అనే ముచ్చటే ఉత్పన్నం కాదని అన్నారు . బీజేపీ చర్యలను ప్రజలు చాల నిశితంగా గమనిస్తున్నారని ,చైతన్యం అయిన తెలంగాణ ప్రజలు బీజేపీనీ ఆదరిస్తారని అనుకోవడంలేదని భట్టి తన అభిప్రాయాలు వెల్లడించారు .

Related posts

రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర లో బీజేపీ , రాజస్థాన్ లో కాంగ్రెస్ దే హావా!

Drukpadam

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది ;ఉత్తమ్!

Drukpadam

బ్రిటన్ నూతన ప్రధానిగా లిజ్ ట్రస్… రిషి సునాక్ కు నిరాశ!

Drukpadam

Leave a Comment