Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రియాంక సమక్షంలో పొంగులేటి ,జూపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నారా…?

ప్రియాంక సమక్షంలో పొంగులేటి ,జూపల్లి కాంగ్రెస్ లో చేరబోతున్నారా…?
తగిన ప్రాధాన్యత ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించిందా …
సునీల్ కొనుగోలు దౌత్యం ఫలించిందా
మరికొందరు నేతలు కాంగ్రెస్ లో చేరనున్నారా
ఈ విషయంపై రేణుక చౌదరితో రేవంత్ చర్చలు జరిపారని వార్తలు వైరల్

తెలంగాణాలో ఒక పక్క ఎండలు వేడెక్కుతుండగా మరో పక్క రాజకీయాల్లో హీట్ పెరిగింది. మారి కొద్దీ నెలల్లో ఎన్నికల షడ్యూల్ కూడా రానుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చేటుచేసుకోనున్నాయి. బీఆర్ యస్ నుంచి ఇటీవల సస్పెన్షన్ కు గురైన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , మహబూబ్ నగర్ కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైయ్యారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వారు మాత్రం తాము ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తరచూ అంటున్నారు .రాజక్రీయ క్రాస్ రోడ్ లో ఉన్న, పొంగులేటి ,జూపల్లి మే మొదటి వారంలో తమ నిర్ణయం ఉంటుందని అంటున్నారు . వీరితోపాటు రాష్ట్రంలో మరికొందరు కూడా కాగ్రెస్ లో చేరబోతున్నారని సమాచారం …ఈకార్యక్రమానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే బీజేపీ నేతలు కూడా వారి కోసం పెద్ద ఎత్తున గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు . చేవెళ్లకు చెందిన బీఆర్ యస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఈనెల 21 అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు . ఆయనతోపాటు మరికొందరు ముఖ్యనేతలు చేరతారని అంటున్నారు .

మొత్తం మీద ఈసారి రాష్ట్ర రాజకీయాలు ఆసక్తిగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వరసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చిన రాజకీయ చాణిక్యుడు కేసీఆర్ మరోసారి రాష్ట్రంలో గులాబీ జెండాను రెపరెప లాడించాలని పావులు కదుపుతున్నారు. అందుకు అనుగుణంగా ఎత్తులు వేస్తున్నారు . మరోసారి గద్దెనెక్కేందుకు వ్యూహరచన చేస్తున్నారు . ఎన్నికల ఎత్తులు ,జిత్తుల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలను కొందరికి ముఖ్యమైన పదవులు ఆఫర్ చేయడం ద్వారా పార్టీలో చేర్చుకొని ప్రత్యర్థి పార్టీలకు షాక్ ఇవ్వాలని కేసీఆర్ ఎత్తుగడగా ఉన్నట్లు తెలుస్తుంది…ఇందులో ఆయన ఎంతవరకు సఫలీ కృతం అవుతారు అనేది చూడాలి ..

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చేస్తానని , బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శలు ఉన్నాయి. దీంతో కేసీఆర్ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో పొంగులేటి ,జూపల్లి ఉన్నారు . ఇప్పటికే వివిధరంగాల్లో ఉన్న ప్రముఖులతో సమాలోచనలు జరిపారు . రాష్ట్రంలో బీఆర్ యస్ ను ఓడించాలంటే ఏది బెటర్ , బీజేపీనా ..? కాంగ్రెస్ నా అనేదానిలో ఉన్నారు .చాలామంది సలహాలు తీసుకుంటున్నారు . వారి అనుయాయుల సలహాలు వింటున్నారు . ఇప్పటికే అనేక సమావేశాల్లో వారు తమ విధానాలను వెల్లడించారు .దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నారు .

పొంగులేటి ,జూపల్లి కాంగ్రెస్ లో చేరితే ఉభయకుశలోపరిగా ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రంపై వారి ప్రభావం ఎలా ఉన్న ఖమ్మం ,మహబూబ్ నగర్ జిల్లాల్లో మాత్రం కాంగ్రెస్ కు అండ్వాంటేజ్ ఉండటంతోపాటు వారు అనుకున్నవారికి సీట్లు ఇప్పించడంతోపాటు గెలిపంచడం కూడా సులువుగా ఉంటుందని రాజకీయ పరిశీలకుల భావన …

పొంగులేటి చేరికపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఇంటికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తుంది….జిల్లా కు చెందిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉన్నారు .ఆయనతో కూడా ఏఐసీసీ నేతలు సంప్రదించారని అంటున్నారు.

Related posts

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ ఎన్నికల ఇంచార్జిలుగా హేమ హేమీలకు భాద్యతలు !

Drukpadam

మల్లెల తీర్థం జలపాతానికి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీస్!

Drukpadam

గోడల మీద పేరు సులువుగా చెరప గలరేమో కానీ ప్రజల మనసుల్లో చెరప లేరు…ఎమ్మెల్యే సీతక్క!

Drukpadam

Leave a Comment